సూపర్ స్టార్ కృష్ణ డై హార్డ్ ఫ్యాన్ కృష్ణసాయి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జ్యువెల్ థీఫ్’. Beware of Burglar అనేది సబ్ టైటిల్. మీనాక్షి జైస్వాల్ హీరోయిన్. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు. ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. బ్యాంకాక్, థాయిలాండ్ లో పాటలను గ్రాండ్ గా చిత్రీకరించారు. ఇటీవల విడుదలైన టీజర్ , ట్రైలర్ కు అనూహ్య స్పందన వచ్చింది. హీరో కృష్ణ సాయి డాన్స్ , మేనరిజమ్స్ , హెయిర్ స్టైల్ సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేస్తుండటం విశేషం. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో సినిమాను నవంబర్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటీనటులు ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.
హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని..ఆయన ఇన్సిపిరేషన్ తో చిత్ర సీమలోకి అడుగుపెట్టాను. ‘ జ్యువెల థీప్ ‘ అనే మంచి కథ లో ప్రేక్షకుల ముందుకొస్తున్నామని అన్నారు… ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ , టీజర్ మరియు ట్రైలర్ , సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది.. మరో వైపు సెన్సార్ బోర్డు ప్రశంసలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ‘జ్యువెల్ థీఫ్’ ఓ సస్పెన్స్ థ్రిల్లర్. నవంబర్ 8 న విడుదల కాబోతున్న మా సినిమా ఈ తరం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఒకప్పటి హీరోయిన్ ప్రేమ గారితో కలిసి ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది.” అన్నారు.
నటీనటులు:
హీరో కృష్ణసాయి, హీరోయిన్ మీనాక్షి జైస్వాల్, ప్రేమ, అజయ్, సమ్మెట గాంధీ, సీనియర్ కన్నడ హీరోలు శ్రీధర్, వినోద్ కుమార్, నటీమణులు రాగిణి, హీరోయిన్ నేహా దేశపాండే, ఆనంద చక్రపాణి, జెన్నీ, మేక రామ కృష్ణ, వైజాగ్ జగదీశ్వరి, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, అప్పాజి, కాట్రగడ్డ సుధాకర్, జంగారెడ్డి, వెంకట రమణారెడ్డి, శ్రావణి, శ్వేత రెడ్డి తదితరులు.
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం:
పీఎస్ నారాయణ
డీవోపీ: అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్ : జేపీ
ఫైట్ మాస్టర్: రమణ
డాన్స్: స్వర్ణ, యాని
లిరిక్ : కామేశ్వర్, పీఎస్ నారాయణ
మ్యూజిక్: ఎంఎం శ్రీలేఖ,
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
ఆర్ట్ డైరెక్టర్ కె.మురళీధర్,
పీఆర్వో: కడలి రాంబాబు, దయ్యాల అశోక్.