కృష్ణ సాయి ‘జ్యువెల్ థీఫ్’ మూవీ టీజర్ లాంచ్ చేసిన 30 ఇయర్స్ పృధ్వీ

కృష్ణసాయి – మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న సినిమా ‘జ్యువెల్ థీఫ్’ .శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై, పీఎస్ నారాయణ దర్శకత్వంలో, ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ సాయితో పాటు సీనియ‌ర్ న‌టీన‌టులు.. ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు న‌టించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను 30 ఇయర్స్ పృధ్వీ విడుదల చేశారు. ఈ సందర్భంగా

30 ఇయర్స్ పృధ్వీ మాట్లాడుతూ… హీరోగా కృష్ణసాయి ‘జ్యువెల్ థీఫ్’ సినిమాలో యాక్షన్ పార్టులు బాగా చేసాడు. ఆయన యాక్టింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఈ మూవీలో నా రోల్ కూడా బాగుంది. సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. నేను, కృష్ణసాయి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులం. స‌మాజం కోసం కృష్ణ సాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణ సాయి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. మంచితనం, మానవత్వం కలబోసిన వ్యక్తి. గ‌తంలోనే కృష్ణ‌సాయి డ్రగ్స్ మీద అవగాహన వీడియోలు చేశారు. నిజ జీవితంలోనూ రియల్ హీరో కృష్ణ సాయి. అని చెప్పుకొచ్చారు.

హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ… నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వ‌చ్చాను. ‘జ్యువెల్ థీఫ్’ ఓ సస్పెన్స్ థ్రిల్ల‌ర్. ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంది. ఇక ఎంఎం శ్రీలేఖ అందించిన మ్యూజిక్ బాగుంది. ఒక‌ప్పుడు హీరోయిన్ ప్రేమ గారి సినిమాలు చూశాను. ఆమెతో క‌లిసి న‌టించాల‌న్న నా కల ఈ సినిమాతో నెరవేరింది.

ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ మాట్లాడుతూ… కృష్ణ సాయికి తగ్గ కథ ఇది. సినిమా నటీనటులు, చిత్ర యూనిట్ అందరు బాగా చేశారు. ఇది చిన్న సినిమా కాదు, పేరున్న సీనియర్ నటీనటులు ఇందులో ఉన్నారు. అంద‌రిని ఆక‌ట్టుకునే సినిమా ఇది. త్వ‌ర‌లోనే సినిమాను థియేట‌ర్‌ల‌లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు తెలిపారు.

హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ : మంచి కాన్సెప్ట్ తో రూపోందిన ‘జ్యువెల్ థీఫ్’ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీలో నటించిన అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఙతలు అన్నారు…

నటీనటులు:
హీరో కృష్ణసాయి, హీరోయిన్ మీనాక్షి జైస్వాల్, ప్రేమ, అజయ్, సీనియర్ కన్నడ హీరోలు శ్రీధర్, వినోద్ కుమార్, నటీమణులు రాగిణి, హీరోయిన్ నేహా దేశపాండే , ఆనంద చక్రపాణి, జెన్నీ, మేక రామ కృష్ణ, వైజాగ్ జగదీశ్వరి, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, అప్పాజి, కాట్రగడ్డ సుధాకర్, జంగారెడ్డి, వెంకట రమణారెడ్డి, శ్రావణి, శ్వేత రెడ్డి తదితరులు.

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం:
పీఎస్ నారాయణ

డీవోపీ: అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్ : జేపీ
ఫైట్ మాస్టర్: రమణ
డాన్స్: స్వర్ణ, యాని
లిరిక్ : కామేశ్వర్, పీఎస్ నారాయణ
మ్యూజిక్: ఎంఎం శ్రీలేఖ,
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
ఆర్ట్ డైరెక్టర్ కె.మురళీధర్,
పీఆర్వో: కడలి రాంబాబు, దయ్యాల అశోక్

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago