మత్స్యకారుల జీవితాల నేపథ్యంతో “జెట్టి”, ఈ నెల 28న రిలీజ్

నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “జెట్టి”. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వం వహిస్తున్నారు. చివరి దశ సన్నాహాల్లో ఉన్న ఈ సినిమా ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా

హీరోయిన్ నందిత శ్వేతా మాట్లాడుతూ…విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పల్లెటూరి అమ్మాయిగా నటించాలి అనేది నా కోరిక. అది ఈ సినిమాతో నెరవేరింది. ఈ సినిమా గురించి చెబితే అర్థం కాదు. తెరపై చూసి అనుభూతి చెందాల్సిందే. చీరాల ప్రాంతాన్ని మా చిత్రంలో సినిమాటోగ్రాఫర్ అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాత వేణు గారు సినిమా ప్రారంభం నుంచీ చివరి దాకా ఒకటే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. జెట్టితో మంచి విజయం సాధిస్తామనే నమ్మకం మా అందరిలో ఉంది. అని చెప్పింది.

దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక మాట్లాడుతూ…ఈ సినిమా రూపొందించే అవకాశం ఇచ్చిన నిర్మాత వేణు మాధవ్ కె గారికి థాంక్స్. సినిమా మేకింగ్ లో ఎక్కడా ఆయన కాంప్రమైజ్ కాలేదు. అలాగే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా ది బెస్ట్ వర్క్ చేయిస్తున్నారు. ఖర్చు గురించి ఆలోచించకుండా సినిమాను నిర్మించారు. మత్స్యకారుల జీవితాల్లోని సమస్యలను చెప్పే చిత్రమిది. కొందరు తమ స్వార్థంతో పోర్టుల పేరుతో వారి మత్య్సకారుల జీవితాలను ఎలా ఇబ్బందులు పెడుతున్నారు అనేది ఇట్రెస్టింగ్ గా తెరకెక్కించాం. హీరో హీరోయిన్లతో పాటు పలువురు మైమ్ గోపీ వంటి స్టేజీ ఆర్టిస్టులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. అన్నారు.

నిర్మాత వేణు మాధవ్ కె మాట్లాడుతూ…జెట్టి అంటే పోర్టు అని అర్థం. మన సముద్ర తీరాన ఎంతోమంది మత్స్యకారులు జీవితాలను సాగిస్తున్నారు. వీళ్లు నివసించే ప్రాంతాల్లో పోర్టులను ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ల జీవనోపాధిని కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు దెబ్బతీస్తున్నారు. కష్టపడితే గానీ రోజు గడవని పరిస్థితి వారిది. అలాంటి మత్స్యకారుల జీవితాల్లోని సమస్యలను ప్రతిబింబించే చిత్రమిది. సగటు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలుంటాయి. కార్తీక్ కొడకండ్ల సంగీతం ఆకర్షణ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ తుది దశలో ఉంది సినిమా. ఈ నెల 28న మూవీని విడుదల చేయబోతున్నాం. మత్య్సకారుల జీవన విధానాలను, వారి కట్టుబాట్లను, ఇప్పటివరకూ వెండితెరమీద కనిపించని జీవితాలను తెరమీద హృద్యంగా దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక తీసుకురాబోతున్నాడు. అన్నారు.

హీరో మన్యం కృష్ణ మాట్లాడుతూ…ప్రేక్షకులకు జెట్టీ సినిమా ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. ఈ సిినిమా ఇంత బాగా వచ్చిందంటే కారణం నిర్మాత వేణు, దర్శకుడు సుబ్రహ్మణ్యం గారు కారణం. ఈ చిత్రంలో ఒక మంచి పాత్రతో మీ ముందుకొస్తున్నాను. మిమ్మల్ని సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ నెల 28న థియేటర్లలో చూడండి. అన్నారు.

సంగీత దర్శకుడు కార్తీక్ కొడకండ్ల మాట్లాడుతూ…ఈ చిత్రంలో మంచి మ్యూజిక్ ఇచ్చే అవకాశం దొరికింది. ఈ పాటకు ఫలానా సింగర్ కావాలి అనుకుంటే కాంప్రమైజ్ కాకుండా నిర్మాత ఇచ్చారు. అలా సిధ్ శ్రీరామ్, సునీత వంటి సింగర్స్ తో పాటలు పాడించాం. హృద్యమైన కథా కథనాలతో పాటు మ్యూజికల్ గా సినిమా ఆకట్టుకునేలా ఉంటుంది. అన్నారు.

సాంకేతిక బృందం
బ్యానర్ : వర్ధని ప్రొడక్షన్స్
మ్యూజిక్ : కార్తిక్ కొడకండ్ల‌
డిఓపి: వీర‌మ‌ణి
ఆర్ట్ ః ఉపేంద్ర రెడ్డి
ఎడిటర్: శ్రీనివాస్ తోట‌
స్టంట్స్: దేవరాజ్ నునె
కోరియోగ్రాఫర్ : అనీష్
పబ్లిసిటీ డిజైనర్: సుధీర్
డైలాగ్స్ ః శ‌శిధ‌ర్
పిఆర్ ఓ : జియస్ కె మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః పండ్రాజు శంక‌ర్రావు
నిర్మాత ః వేణు మాధ‌వ్
క‌థ‌, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ ః సుబ్ర‌హ్మ‌ణ్యం పిచ్చుక

నటీ నటులు: నందిత శ్వేత‌, కృష్ణ , క‌న్న‌డ కిషోర్, మైమ్ గోపి, ఎమ్ య‌స్
చౌద‌రి, శివాజీరాజా, జీవా, సుమ‌న్ షెట్టి తదితరులు

Tfja Team

Recent Posts

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

10 hours ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

2 days ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

2 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

2 days ago

బుక్ మై షోలో 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…

2 days ago

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…

2 days ago