పా పాండి, రాయన్ వంటి బ్లాక్ బస్టర్‌ల తరువాత ధనుష్ ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’ అంటూ దర్శకుడిగా మరోసారి అందరినీ మెప్పించేందుకు రెడీ అయ్యారు. ధనుష్ హోమ్ బ్యానర్ అయిన వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌కె ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ మూవీని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి విడుదల చేస్తోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో..
జాన్వీ నారంగ్ మాట్లాడుతూ.. ‘మేం ఓ కొత్త లవ్ స్టోరీతో రాబోతోంది. ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’ ఫిబ్రవరి 21న అందరి ముందుకు రాబోతోంది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసే అవకాశాన్ని ఇచ్చిన ధనుష్ గారికి థాంక్స్. ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.
అనికా సురేంద్రన్ మాట్లాడుతూ.. ‘మా చిత్రం ఫిబ్రవరి 21న రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి సపోర్ట్ చేయండి. మా చిత్రాన్నితెలుగులో రిలీజ్ చేస్తున్న ఏషియన్, సురేష్ గార్లకు థాంక్స్’ అని అన్నారు.
నటి రబియా మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంతోనే నేను ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాను. సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాం. మేం అందరం కొత్త వాళ్లమే. ఈ సినిమాను అందరూ ఆదరించండి. ఫిబ్రవరి 21న థియేటర్లోకి మేం అంతా రాబోతోన్నామ’ని అన్నారు.
వెంకటేష్ మీనన్ మాట్లాడుతూ.. ‘ఫిబ్రవరి 21న మా చిత్రం రిలీజ్ కాబోతోంది. మా సినిమాను అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
రమ్య రంగనాథన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలుగు ఎక్కువగా రాదు. ఈ మూవీతోనే నేను తెరకు పరిచయం కాబోతోన్నాను. ఈ సినిమా ప్రమోషన్స్‌కు హైదరాబాద్ రావడం ఆనందంగా ఉంది. మా సినిమాను ఫిబ్రవరి 21న థియేటర్లో చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
పవిష్ మాట్లాడుతూ.. ‘వెంకీ అట్లూరి గారి వల్లే నేను కెమెరా ముందుకు రాగలిగాను. మా చిత్రం ఫిబ్రవరి 21న రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…