మల్టీటాలెంటెడ్ ధనుష్ హీరోగా, దర్శకుడిగా, గాయకుడిగా, పాటల రచయితగా, నిర్మాతగా ఇలా సినీ పరిశ్రమపై తన ముద్ర వేస్తూనే ఉన్నారు. హీరోగా ఇప్పుడు ధనుష్ ఎంత బిజీగా ఉన్నా కూడా దర్శకత్వం సైతం వహిస్తున్నారు. పా పాండి, రాయన్ తర్వాత ధనుష్ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే సినిమాతో దర్శకుడిగా ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ధనుష్ హోమ్ బ్యానర్ అయిన వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌కె ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.
రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్‌తో పాటు ఫిబ్రవరి 21, 2025న తెలుగులోనూ విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఈ క్రమంలో మేకర్లు ప్రమోషనల్ కార్యక్రమాల్ని పెంచేశారు. తమిళంలో ఆల్రెడీ “గోల్డెన్ స్పారో” అనే పెప్పీ సాంగ్ సెన్సేషనల్‌గా మారిన సంగతి తెలిసిందే. జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ ఎనర్జిటిక్ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.
ఇక ఇప్పుడు ఈ పాటను తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఈ పాటను అశ్విన్ సత్య, సుధీష్ శశికుమార్, సుబ్లాషిణి అద్భుతంగా ఆలపించారు. రాంబాబు గోసాల రాసిన సాహిత్యం ఆకట్టుకుంటుంది. ఈ పాటలో ప్రియాంక మోహన్ లుక్స్, స్టెప్పులు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. యూత్ ఆడియెన్స్‌కు ఇట్టే కనెక్ట్ అయ్యే ఈ పాట ఇక తెలుగులోనూ చార్ట్ బస్టర్‌గా మారనుంది.
ఈ చిత్రంలో పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్‌గా లియోన్ బ్రిట్టో, ఎడిటర్‌గా జి.కె. ప్రసన్న వ్యవహరిస్తున్నారు.
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…
శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…