‘తిరగబడరసామీ’ లాంటి మంచి ఎంటర్‌టైనర్ తో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా వుంది.

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ ట్రైలర్ పాటలకు రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ మాల్వి మల్హోత్రా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

ముందుగా మీ గురించి చెప్పండి? 

-మాది హిమాచల్ ప్రదేశ్. చదువుకోవడానికి ముంబై వెళ్లాను. అక్కడే థియేటర్ ఆర్ట్స్ లో చేరాను. టీవీ ఇండస్ట్రీ నుంచి నా కెరీర్ మొదలైయింది. తర్వాత ఓ హిందీ ఫిల్మ్ చేసే ఛాన్స్ వచ్చింది. అలాగే ఒక మలయాళం, తమిళ్ సినిమా చేశాను. ఇది తెలుగులో నా మొదటి సినిమా. 

ఈ సినిమాలో మీరు బాలకృష్ణ గారి అభిమానిగా కనిపిస్తారు కదా.. మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది ?

-చాలా ఇంట్రస్టింగ్ క్యారెక్టర్. చాలా ఎనర్జిటిక్ హైపర్ యాక్టివ్ అమ్మాయిగా కనిపిస్తాను. నా క్యారెక్టర్ కారణంగానే కథ అంతా జరుగుతుంది. ఇందులో ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా వుంటాయి, అలాగే నాకో యాక్షన్ సీక్వెన్స్ కూడా వుంది. అది బాలకృష్ణ గారికి రిలేట్ అయ్యేలా వుంటుంది. బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఫిల్టర్ వుండదు. ఆయన మనసులో వున్నది వున్నట్లుగా మాట్లాడేస్తారు. ఇందులో నా క్యారెక్టర్ కూడా అలానే వుంటుంది. నా క్యారెక్టర్ విమన్స్ కి సెల్ఫ్ డిఫెన్స్ ప్రాముఖ్యతని నేర్పించేలా వుంటుంది. తొలి సినిమాలోనే యాక్షన్ సీక్వెన్స్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. 

-బాలకృష్ణ గారి సినిమాలు చూస్తుంటాను. అన్ని ఇండస్ట్రీలలో ఆయనకి హ్యుజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఆయన చాలా సరదా వుంటారు. ఆయన గత చిత్రం భగవంత్ కేసరి ని చాలా ఎంజాయ్ చేశాను.  

డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి గారి గురించి ? 

-రవికుమార్ గారు చాలా మంచి విజన్ వున్న డైరెక్టర్. తను ఏదైతే చెప్పారో సరిగ్గా అదే ఎగ్జిక్యూట్ చేశారు. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. 

‘తిరగబడరసామీ’ లో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి? 

-ఇందులో చాలా ఎమోషన్స్, యాక్షన్, డ్రామా, రోమాన్స్, ఫన్ ఇలా ఎలిమెంట్స్ వున్నాయి. ముఖ్యంగా రాజ్ తరుణ్ గారికి క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుంది. సైలెంట్ గా మొదలై వైలెంట్ గా మారే క్యారెక్టర్. ఆడియన్స్ ఎంజాయ్ చేసే అన్నీ ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి.

నిర్మాత మల్కాపురం శివకుమార్ గురించి ? 

-శివ గారు వెరీ నైస్ పర్శన్. ఫ్యామిలీ పర్శన్ లా వుంటారు. వాళ్ళ అమ్మాయి నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. నన్ను తెలుగు సినిమాకి పరిచయం చేసినందుకు ఆయనకి రుణపడి వుంటాను. 

హీరో రాజ్ తరుణ్ గురించి ?

-రాజ్ తరుణ్ చాలా నైస్ పర్శన్. సెట్స్ లో చాలా ఎంటర్ టైనింగ్ గా వుంటారు. చాలా సపోర్టివ్. ఆయనతో వర్క్ చేయడం నైస్ ఎక్స్ పీరియన్స్. 

జెబి మ్యూజిక్ గురించి ? 

-చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నేపధ్య సంగీతం కూడా సీన్స్ ని ఎలివేట్ చేస్తోంది. 

మకరంద్ దేశ్ పాండే గారితో కలిసి పని చేయడం ఎలా అనిపించింది ? 

-ఆయన గ్రేట్ యాక్టర్. చాలా వినయంగా వుంటారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. 

తెలుగు సినిమాలు చూస్తుంటారా? ఎవరి సినిమాలో పార్ట్ అవ్వాలని కోరుకుంటారు ? 

-చూస్తాను. బొమ్మరిల్లి, ఏం మాయ చేశావా నా ఫేవరేట్ ఫిలిమ్స్. రీసెంట్ గా బేబీ సినిమా చూశాను. రాజమౌళి గారి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల. అలాగే మణిరత్నం సార్ తో కూడా కలసి పని చేయాలని వుంది. 

టాలీవుడ్ లో మీ ఫేవరేట్ హీరో ? 

-అందరు హీరోలు ఇష్టమే. అయితే ఒక థియేటర్ ఆర్టిస్ట్ గా యాక్టర్ కళ్ళలో డెప్త్ గురించి మాట్లాడుకుంటే .. నాని గారి పేరు చెప్తాను. తన కళ్ళతో అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్, ఎమోషన్స్ పలికించే యాక్టర్ తను. తనతో వర్క్ చేయడానికి ఇష్టపడతాను. అలాగే మహేష్ బాబు గారు, అడివి శేష్ గారు అంటే ఇష్టం.  

ఎలాంటి సినిమాలు చేయాలనీ కోరుకుంటారు ? 

-అన్ని జోనర్స్ ఇష్టమే. అయితే కథలో ప్రాధాన్యత వున్న పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. 

తెలుగులో కొత్త సైన్ చేసిన ప్రాజెక్ట్స్ ? 

-కొన్ని ప్రాజెక్ట్స్ వున్నాయి. త్వరలోనే ఫైనల్ అవుతాయి. 

ఆల్ ది బెస్ట్ 

-థాంక్ యూ

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago