రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై అందరినీ ఆకట్టుకుంది.
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే అంశాలతో ఉండగా, ప్రధాన పాత్రలు పోషించిన రాకేష్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. నిజ జీవిత ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో అన్ని సన్నివేశాలను చక్కగా చిత్రీకరించారు. కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ దేశం కోసం ధర్మం కోసం నక్సలైట్ల తో జితేందర్ రెడ్డి చేసిన పోరాటాన్ని ఈ సినిమా లో చూపించారు. అంతే కాకుండా, ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి రావడం, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ తో మాట్లాడటం ట్రైలర్ లో చూపించారు.
యాక్షన్ డ్రామా గా రాబోతున్న ఈ చిత్రం లో డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. చక్కని కెమరా వర్క్ కి నేపథ్య సంగీతం కూడా తోడవడం కలిసొచ్చే అంశం. టెక్నికల్ గా ఈ సినిమా అన్ని విభాగాల్లో హైలైట్ గా నిలిచింది. రాకేష్ ఇప్పటి వరకు పోషించిన అన్ని పాత్రల్లోకి ఇది చాలా డిఫరెంట్ అని తెలుస్తుంది. ఈ చిత్రం కోసం తన ఫిజికల్ ట్రాన్సఫరమేషన్ కూడా మెచ్చుకొనే విధంగా ఉంది.
1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘జితేందర్ రెడ్డి’. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
జితేందర్ రెడ్డి సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాటికే విడుదలైన సినిమా టీజర్, గ్లిమ్ప్స్, మూడు పాటలు ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్నాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం ఆసక్తికర అంశం.
యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.
దర్శకుడు: విరించి వర్మ
నిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డి
సహ నిర్మాత: ఉమ రవీందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాణిశ్రీ పొడుగు
ఛాయాగ్రాహకులు: వీ ఎస్ జ్ఞాన శేఖర్
సంగీత దర్శకులు: గోపి సుందర్
ఎడిటర్: రామకృష్ణ అర్రం
పీఆర్: మధు వి ఆర్
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్హిట్ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. ఈయన…
తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…
ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ కల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు…
దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…
అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్…