టాలీవుడ్

ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్ – ఈనెల 24న తెలుగు విడుదల

అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తూ వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఐడెంటిటీ. మలయాళంలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది. జేక్స్ బెజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రానికి చామన్ చక్కో ఎడిటింగ్ చేశారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అత్యంత చెరువుగా మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు గారు కలిసి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో విడుదల కానుంది. ఈ నెల 24వ తేదిన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే నేడు హైదరాబాదులో చిత్ర యూనిట్ సమక్షంలో ఈ చిత్ర తెలుగు టైలర్ లాంచ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ… “ఐడెంటిటీ చిత్ర ట్రైలర్ లంచ్ కు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చాము. ఈ చిత్రం మలయాళంలో జనవరి 2వ తేదీన విడుదలై ఇప్పటికే 40 కోట్లకు పైగా వసూలు చేసింది. సంక్రాంతి సమయానికి ఇక్కడ సినిమాలు ఉండటంవల్ల అదే సమయంలో విడుదల చేయలేకపోయాము. అందుకే ఈనెల 24వ తేదీన విడుదల చేస్తున్నాము. ఈ చిత్రంలో మన తెలుగువారి కొడుకుని యాక్షన్ కంటెంట్ చాలా బాగుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం మలయాళంలో బాగా ప్రేక్షకుల మరణ పొందడంతో తెలుగులో కూడా ఈ చిత్రం అలాగే ఉంటుందని ఎన్నో అంచనాలు ఉన్నాయి. అనుకొని కారణాలవల్ల హీరో టోవినో థామస్, హీరోయిన్ త్రిష ఈ వేడుకకు రాలేకపోయారు. దర్శకులు ఎంతో జాగ్రత్తగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు అర్థమవుతుంది. ఈ చిత్రం కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. దర్శకులు ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషకరంగా ఉంది” అన్నారు.

చింతపల్లి రామారావు గారు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా వారికి, స్నేహితులకి, సన్నిహితులకి అందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు. ఈ నూతన సంవత్సరంలో సంచలన వసూలతో గొప్ప విజయం సాధించింది ఐడెంటిటీ సినిమా. మామిడాల శ్రీనివాసరావు గారితో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాము. ఇది మలయాళ చిత్రం అయినప్పటికీ ఈ చిత్రంలో నటించిన వారు అలాగే ఈ సినిమాకు పనిచేసినవారు తెలుగునాట అందరికీ సుపరిచితులు కావడం విశేషం. ఈ చిత్రం ద్వారా దర్శకులకు తెలుగులో మంచి గుర్తింపు వస్తుందని కోరుకుంటున్నాము. జనవరి 24వ తేదీన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులు ముందుకు రానుంది. యాక్షన్ త్రిలరైనటువంటి ఈ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా వినోదపరుస్తుందని కోరుకుంటున్నాను” అన్నారు.

అఖిల్ పాల్ మాట్లాడుతూ… “ముందుగా మీడియా వారందరికీ నా ధన్యవాదాలు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ సినిమా మొదలైనప్పటికి నుండి సుమారు రెండు మూడు సంవత్సరాలుగా నాతో ప్రయాణం చేస్తున్న చిత్ర కథానాయకుడు టోవినో థామస్. చిత్ర నిర్మాతలతో కలిసి ఆయన కూడా ఈ సినిమా కోసం నిలబడ్డారు. మలయాళం సినిమా బడ్జెట్ తో పోలిస్తే ఈ చిత్రం బడ్జెట్ కొంచెం ఎక్కువగానే అయింది. ఈ చిత్రం ఎంతోమంది ప్రముఖ నటీనటులు, సాంకేతిక సిబ్బంది ముందుకు వచ్చి పని చేశారు. ఈ చిత్రం మొదలైన సమయంలోనే ఈ చిత్రాన్ని దేశమంతుడు చూపించాలని మేము అనుకున్నాము. అందుకే ముందు నుండి కూడా ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తగా పని చేసాము. స్క్రిప్ట్ నుండి యాక్షన్ సీన్స్ వరకు చాలా జాగ్రత్త పడ్డాము. తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకురావడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. కేరళలో సాధించినట్లు ఎక్కడ కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుందని అనుకుంటున్నాను. ట్రైలర్ ఎంత పవర్ఫుల్ గా వచ్చింది. అంతే పవర్ ఫుల్ గా ఈ సినిమా కూడా ఉండబోతుంది” అన్నారు.

నటుడు వినయ్ రాయ్ మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ముందుగా ఇక్కడ టైలర్ చూసి నన్ను ఎంత సపోర్ట్ చేసిన మీడియా వారందరికీ నా ధన్యవాదాలు. రామారావు గారికి, శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. తెలుగులో ప్రశాంత్ వర్మ నన్ను ప్రేక్షకులందరికీ ఎంతగా గుర్తుండిపోయిన చేశారో మలయాళం లో కూడా అఖిల్ ఆ స్థాయిలో నాకు గుర్తింపు వచ్చేలా చేశారు. నా 18 సంవత్సరాల కెరియర్ లో ఇటువంటి కథను నేను ఎప్పుడు వినలేదు. ఈ చిత్రంలో యాక్షన్, సస్పెన్స్, మంచి స్టోరీ లైన్ ఇలా అన్నీ ఉన్నాయి. ఈ చిత్రం తెలుగువారికి ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను. తెలుగు నిర్మాతలకు ఈ చిత్రం మంచి బిజినెస్ చేస్తుందని అనుకుంటున్నాను. జనవరి 24వ తేదీన ఈ చట్టం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది” అంటూ ముగించారు.

తారాగణం: టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్, మందిరా బేడి తదితరులు.

సాంకేతిక బృందం :
రచన దర్శకత్వం : అఖిల్ పాల్, అనాస్ ఖాన్
నిర్మాతలు : రాజు మల్లియాత్, రాయ్ సిజె
సినిమాటోగ్రఫీ : అఖిల్ జార్జ్
ఎడిటర్ : చామన్ చక్కో
సంగీతం : జేక్స్ బెజోయ్
సమర్పణ : మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల
తెలుగు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ : శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

23 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago