ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం… రూ.1831 కోట్ల వసూళ్లతో భారతీయ సినీ చరిత్రలో రికార్డులను తిరగరాసిన ఐకాన్‌స్టార్ పుష్ప-2 ది రూల్
ఇండియన్ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్ రూల్.. రూ.1831 కోట్ల వసూళ్లతో ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు!
డిసెంబరు 4న ప్రీమియర్స్ షోస్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌పై మొదలైన ‘పుష్ప-2’ ది రూల్ వసూళ్ల రికార్డుల పరంపర సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డును క్రియేట్‌చేసింది. కేవలం 32 రోజుల్లోనే రూ. 1831 కోట్ల రూపాయాలు వసూలు చేసి పుష్ప ది రూల్ భారతీయ సినీ చరిత్రలో తన పేరు మీద తిరగరాసుకుంది. రూ. 1810 కోట్ల రూపాయాలు వసూలు చేసిన బాహుబలి-2 వసూళ్లను క్రాస్ చేసి పుష్ప-2 కొత్త రికార్డును క్రియేట్ చేసింది.
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్‌ల కలయికలో రూపొందిన పుష్ప-2 ది రూల్..ఈ సన్సేషన్ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్ నుంచే సన్సేషనల్ బ్లాకబస్టర్ అందుకుంది. అల్లు అర్జున్ నట విశ్వరూపంకు, సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్.. ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది. సినిమా తొలి రోజు నుంచే 32 రోజు వరకు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించిన తాజాగా ఈ చిత్రం కేవలం 32 రోజుల్లో 1831 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు సృష్ఠించింది. ఒక రికార్డు ప్రకటించే లోపే మరొ కొత్త రికార్డును పుష్ప-2 సాధించి రికార్డుల సాధించడంలో కూడా ఓ రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రం యావత్ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తుంది. రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలను అందించాడు. కూబా ఫోటోగ్రఫీ సినిమాకు వన్నెతెచ్చింది. ఈ చిత్రం సాధించిన, సాధిస్తున్న వసూళ్లతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియా నెంబర్‌వన్ హీరోగా అందరూ కొనియాడుతున్నారు. దర్శకుడు సుకుమార్ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్ పొజిషన్‌లో ఉన్నాడు.
Q: How do you feel about working with Nandamuri Balakrishna again in Daaku Maharaaj? Pragya…
వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి 'డాకు మహారాజ్' చిత్రంతో అలరించనున్నారు.…
Trending inTelugu & Kannada The song from the upcoming bilingual film "Dude" is going viral…
తెలుగులో ట్రెండింగ్….కన్నడలో సూపర్ హిట్ "ఏమిటో మాయ మంత్రమేమది జింకలా పరిగెత్తేనే…." యువ ప్రతిభాశాలి తేజ్ నటిస్తూ కన్నడ-తెలుగు భాషల్లో…
Q: You’ve been in the industry for over a decade, working with multiple stars across…
నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డాకు మహారాజ్'. వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న…