టాలీవుడ్

50 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పుష్ప రాజ్‌ రూల్‌! పుష్ప-2 ది రూల్‌

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి పుష్ప-2 దిరూల్‌ మీదే. ఈ సినిమాకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా భారతీయ సినీ పరిశ్రమ యావత్‌ ఎదురుచూస్తున్న సినిమా ఇది. అది మన తెలుగు సినిమా కావడం గర్వకారణం. ఇక ‘పుష్ప-2’ ది రూల్‌.. డిసెంబరు 6న ప్రారంభం కానున్న పుష్పరాజ్‌ రూల్‌కు కౌంట్‌స్టార్‌ అయ్యింది. మరో50 రోజుల్లో అంటే డిసెంబరు 6న పుష్ప-2 రూల్‌ బాక్సాఫీస్‌పై ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ఐకాన్‌స్టార్‌ మాసివ్‌ లుక్‌తో పుష్పరాజ్‌గా రూల్‌ చేయడానికి సింహాసనం అధిష్టించిన ఓ పోస్టర్‌ను వదిలారు. అంతేకాదు డిసెంబరు 6న భారతీయ సినిమాలో ఆ రోజు ఓ సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుందని హింట్‌ ఇచ్చారు మేకర్స్‌ ప్రతి సీన్‌కు గూజ్‌బంప్స్‌తో పాటు పుష్ప ది రూల్‌కు అందరూ ఫిదా అయిపోవాల్సిందే అంటున్నారు. మీరు ఎంత ఊహించుకుంటే అంతకు మించి.. అస్సలు తగ్గేదెలే లా చిత్రం వుండబోతుందనే విశ్వాసంతో వున్నారు చిత్ర మేకర్స్‌. పుష్ప దిరైజ్‌తో బార్డర్‌లు దాటిన ఇమేజ్‌తో.. అద్వితీయమైన నటనతో..ఎవరూ ఎక్స్‌పెక్ట్‌ చేయని క్రేజ్‌తో దూసుకపోతున్న ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ‘పుష్ప-2’లో మైస్మరైజింగ్‌ నటన కోసం, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ టేకింగ్‌..మేకింగ్‌.. కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల పతాకంపై ప్రముఖ నిర్మాతలు, నవీన్ ఏర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు సాంగ్స్‌, టీజర్‌కు ఎంతటి అనూహ్యమైన స్పందన వచ్చిందో తెలిసిందే. దేవి శ్రీప్రసాద్‌ అందించిన అందించిన ట్రెండీ పాటలకు అద్వితీయమైన స్పందన వచ్చింది. ఇక పుష్ప-2 ది రూల్‌ నుండి రానున్న ప్రతి ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా అంతే క్రేజీతో రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో వున్న ఈ చిత్రం, మరోవైపు నిర్మాణానంతర పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌హాఫ్‌ పర్‌ఫెక్ట్‌ లాక్ అయిన సంగతి తెలిసిందే. కంటెంట్‌ పరంగానే కాకుండా టెక్నికల్‌గా కూడా పుష్ప-2 అత్యున్నత స్థాయిలో వుండబోతుంది. ఇక డిసెంబరు 6న అందరూ పుష్ప ది రూల్‌ డే అని ఎదురుచూస్తున్నారు..
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే
లిరిసిస్ట్: చంద్రబోస్
సీఈఓ: చెర్రీ
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్–

Tfja Team

Recent Posts

‘పొట్టేల్’ ట్రైలర్ చాలా నచ్చింది. హీరోయిన్ సంయుక్త

-యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, సాహిత్ మోత్ఖూరి, నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ పొట్టేల్ ఇంటెన్స్…

4 hours ago

Pottel’s Intense & Gripping Trailer Unveiled

The small-time film Pottel is making waves, thanks to the impressive promotional material, be it…

4 hours ago

“తల్లి మనసు” చుట్టూ తిరిగే కథ

టీజర్ విడుదల చేసిన చిత్ర బృందం డబ్బింగ్ పూర్తి….నవంబర్ లో సినిమా విడుదల "తల్లిని గురించి ఎంత చెప్పినా తక్కువే.…

4 hours ago

మాట నిలబెట్టుకున్న కిరణ్ అబ్బవరం, “లవ్ రెడ్డి” నాలుగు ఫ్రీ షోస్ ఏర్పాటు

రీసెంట్ గా "లవ్ రెడ్డి" సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొన్న హీరో కిరణ్ అబ్బవరం..ఈ…

4 hours ago

Kiran Abbavaram Arranged Four Free Shows For “Love Reddy”

Recently, hero Kiran Abbavaram, who participated as a guest in the pre-release event of the…

4 hours ago

కర్రి బాలాజీ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘డర్టీ లవ్ ‘

సమాజంలో పేరుకుపోతున్న ‘డర్టీ లవ్‘ ముసుగులో ప్రైవేట్ రూముల్లో శృంగారంతో, రేవ్ పార్టీల్లో విలాసాలతో , పబ్బుల్లో జల్సాలతో యువత…

5 hours ago