కర్మ స్థలం లాంటి కథ నాకూ చేయాలని ఉంది హీరో ఆకాష్ పూరి

రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన చిత్రం ‘కర్మ స్థలం’. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అర్చన(వేద), మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కలకేయ ప్రభాకర్, బాలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను హీరో ఆకాష్ పూరి రిలీజ్ చేశారు. ముఖ్య అతిధులుగా ఆకాష్ పూరితో పాటు మరో హీరో విజయ్ శంకర్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆకాష్ పూరి మాట్లాడుతూ…” అందరికి నమస్కారం. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా వుంది.”కర్మస్థలం” అనే టైటిల్ చాలా చాలా బాగుంది.మోషన్ పోస్టర్ కూడా బాగుంది.చెప్పాలంటే నేను కూడా అమ్మవారి భక్తుడిని.ఇలా అమ్మవారి గురించి సినిమా రావడం సువర్ ఎక్ససైటింగ్.ఈ మధ్య హనుమాన్, కార్తికేయ,కాంతారా ఇలాంటి సినిమాలని ఆడియన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. బాగున్న సినిమాలను మన తెలుగు ఆడియన్స్ ఎపుడు ముందుండి ముందుకి తీసుకెళ్తారు.ఈ సినిమాని ని కూడా ముందుకు తీసుకెళ్తారు.ప్రొడ్యూసర్ గారికి హాట్స్ ఆఫ్ ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చినందుకు.నేను కర్మ ని నమ్ముతాను. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది అలానే చెడు చేస్తే చేడు జరుగుతుంది అని నమ్ముతాను.ఇలాంటి కథ చేయాలి అని నాకు వుంది.టీం అందరికి ఆల్ ది బెస్ట్. అన్నారు.

విజయ్ శంకర్ మాట్లాడుతూ..”నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా థాంక్స్. “కర్మస్థలం” అనే టైటిల్ లోనే ఒక రోయాలిటీ వుంది.మైండ్ లోకి వెళ్లిపోయే టైటిల్. వచ్చే దారిలో ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ చూస్తూ వచ్చాను. చాలా బాగుంది.ఫస్ట్ నుంచి ప్రమోషన్స్ చాలా బాగా చేస్తున్నారు.అలానే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఇలానే చేయండి.ఎందుకంటే నా రాచరికం మూవీకి ప్రమోషన్స్ లేక చాలా లాస్ అయింది.మూవీ తీయడం ఎంత ఇంపార్టెంట్ ఓ పది మందికి తెలిసేలా చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మన టాలీవుడ్ లో మూవీస్ బాగా చేస్తున్నారు కానీ ప్రమోషన్స్ టైం లో డ్రాప్ అయిపోతున్నారు. ఈ మూవీ కి ఆలా కాకుండా ప్రమోషన్స్ మీద టైం పెట్టండి మంచి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంటారు. మిలో ఆ కసి కనిపించింది.మన టాలీవుడ్ లో చాలా మంది మంచి డైరెక్టర్స్ వున్నారు, వాళ్లకి కానీ మంచి ప్రోడుసెర్స్ దొరికితేయ్ రాజమౌళి, సుకుమార్ గారి లాగ సక్సెస్ అవుతారు.ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నారు.

నటుడు సతీష్ సరిపల్లి మాట్లాడుతూ..”కర్మస్థలి కన్నా ముందు కుంభస్థలి చేసాం. మొదట అది చేసిన తరువాత కర్మస్థలం వచ్చింది.నేను ఎంట్రీ అయినప్పుడు చాలా చిన్న ప్రాజెక్ట్. రాకీ డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ విజువల్స్ పరంగా చూస్తే ఒక పెద్ద సినిమా లాగ చేసారు.చిన్న గా స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద ప్రాజెక్ట్ గా తీర్చి దిద్దారు.ఒక సీక్రెట్ ఏంటి అంటే ఇందులో రాకీ గారు కూడా ఒక మంచి రోల్ చేసారు, డైరెక్షన్ చేస్తూ కూడా.ఇపుడే స్టార్ట్ చేసాం ఇంకా చాలా కంటెంట్ వుంది. అందరికి ఈ సినిమా నచుతుంది అని నమ్ముతున్నాను. చాలా థాంక్స్. అన్నారు.

హీరోయిన్ మిథాలీ చౌహాన్ మాట్లాడుతూ…” ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ రాకీ గారికి థాంక్స్.ఈ క్యారెక్టర్ చేయడం వాళ్ళ మంచి అపీప్రిసియేషన్స్ వస్తాయి అని అనుకుంటున్నాను. చాలా థాంక్స్. అన్నారు.

నటుడు క్రాంతి కిల్లి మాట్లాడుతూ..”ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్. 2022 లో కాశ్మీర్ స్టోరీస్ వచ్చింది, 2023 లో కేరళ స్టోరీస్ వచ్చింది, అలానే చావా, రజాకార్ ఇలా కొన్ని సినిమాలు మన సనాతన ధర్మం గురించి మన హిందూ ధర్మం గొప్పతనాన్ని చెప్పాయి. నేను చిన్నపాటి నుంచి చదువుకున్న దాంట్లో తెలియని ఎన్నో కథలను సినిమాలు చూసి తెలుసుకున్నాను.మన హిందూ దర్మం గొప్పతనాన్ని అందరికి తెలియడానికి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి కాబట్టి అందరు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను.ఇలాంటి సినిమాలో నేను కూడా పార్ట్ అవడం చాలా హ్యాపీ గ వుంది.ఇది ఇంతటిత ఆగదు కర్మస్థలం తరువాత కుంభస్థలం వస్తుంది. విక్కీ కౌశల్ కూడా పరుశురాముడు పాత్ర చేస్తున్నారు.హిందుత్వం, సనాతన ధర్మం గొప్పతనాన్ని ఆందరూ ఆదరిస్తారు అని అనుకుంటున్నాను.ఆకాష్ బయ్యా ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్స్. ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు.ఆకాష్ గురించి ఒక చిన్న మాట చెప్పాలి.ఆయన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం వెళ్తున్నాం, సడన్ గావ్ ఆగిపోయి కాళ్ళకి వున్నా చెప్పులు తీసి దూరం లో వున్నా ఒక రాయి కి దణ్ణం పెట్టాడు.. ఇలాంటి సినిమాలకి ఇంత కన్నా గొప్ప గెస్ట్ ఇంకొకరు వుండరు.” అన్నారు.

ప్రొడ్యూసర్ యువరాజ్ మాట్లాడుతూ నేను పూణే నుంచి వచ్చాను.8 నెలల క్రితం నేను రెండు లైన్స్ స్టోరీ విన్నాను. చాలా నచ్చింది.సనాతన దర్మం గురించి చెప్పే సినిమా ఇది.రాకీ చాలా హార్డ్ వర్కింగ్. ఈ సినెమా కోసం తన 100% ఇచ్చాడు.థాంక్ యూ. ” అన్నారు.

డైరెక్టర్ రాకీ మాట్లాడుతూ మనం సాధారణంగా ఎలాంటి పండగ వచ్చిన ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దాని వెనకాల ఒక హిస్టరీ, వార్ ఇలా చాలా వున్నాయి.ఇందులో ఒక మంచి లైన్ చెప్పాను అదే మహిసాసుర మర్ధిని.అందరికి మోషన్ పోస్టర్ నచ్చింది అనుకుంటున్నాను.నేను ఎంత ప్యూర్ గా నమ్మానో అంత మంచిగా ఈ సినిమా చేశాను. అందరు సపోర్ట్ ఇస్తారు అని అనుకుంటున్నాను.” అన్నారు.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago