హీరో కార్తి 25వ చిత్రం గ్రాండ్ గా ప్రారంభం

విలక్షణమైన నటనతో వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటూ  వినోదాత్మక చిత్రాలు అందించడంలో హీరో కార్తి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.2022 వరుస విజయాలతో కార్తికి బ్లాక్ బస్టర్ ఇయర్ గా నిలిచింది. వరుసగా మూడు సూపర్‌ హిట్‌ లను అందుకున్నారుసగుని’,’కాష్మోరా’,’తీరన్ అధిగారమ్ ఒండ్రు’,’ఖైదీ’,’సుల్తాన్’ వంటి 5 సూపర్‌హిట్ చిత్రాల తర్వాత హీరో కార్తి 6వ సారి ప్రతిష్టాత్మక చిత్రం ‘జపాన్’ కోసం డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ మరోసారి జతకలిశారు. వినోదంతో పాటు సామాజిక విలువలతో చిత్రాలు అందించే రాజు మురుగన్ ‘జపాన్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు- డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్, రాజు మురుగన్ కాంబినేషన్ లో వచ్చిన ‘జోకర్’ జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ కార్తి ‘జపాన్’ కోసం రాబోతుంది. కార్తికి ఇది 25వ సినిమా కావడం మరింత విశేషం. 

ఈ చిత్రంలో తొలిసారిగా కార్తి సరసన అను ఇమ్మాన్యుయేల్‌ జోడి కడుతోంది. అల్లు అర్జున్ ‘పుష్ప’లో ‘మంగళం శీను’ పాత్రలో ఆకట్టుకున్న సునీల్ ‘జపాన్’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సునీల్ తమిళ్ లో అరంగేట్రం చేస్తుండటం మరో విశేషం.తమిళ చిత్ర పరిశ్రమలో సినిమాటోగ్రాఫర్‌ గా 25 ఏళ్ల అనుభవంతో పాటు ‘కోలి సోడా’,’కడుగు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తన సత్తాను నిరూపించుకున్న విజయ్ మిల్టన్ ‘జపాన్’ చిత్రంతో తొలిసారిగా నటిస్తున్నారు.బెస్ట్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ గా 2020 నేషనల్ అవార్డ్ గెలుచుకున్న జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు.

మానగరం, ఖైదీ, తానక్కరన్, విక్రమ్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా,  నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ (కమ్మరసంభవం) వినేష్ బంగ్లాన్ ‘జపాన్’ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.’జపాన్’ పూజా కార్యక్రమాలు మంగళవారం (8.11.2022) ఉదయం గ్రాండ్ గా జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై టీమ్‌ బెస్ట్ విశేష్ అందించారు. త్వరలోనే తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. రాజుమురుగన్ – కార్తీ – డ్రీమ్ వారియర్ పిక్చర్స్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న జపాన్ ప్రేక్షకుల్లో  భారీ బజ్ క్రియేట్ చేస్తోంది.’జపాన్’ అభిమానుల అంచనాలను మించేలా ఉంటుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ‘జపాన్’ ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది.

తారాగణం: కార్తి, అను ఇమ్మాన్యుయేల్‌, సునీల్, విజయ్ మిల్టన్ తదితరులు

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: రాజు మురుగన్

బ్యానర్ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్

నిర్మాతలు: ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు

సంగీతం: జివి ప్రకాష్ కుమార్

డీవోపీ: రవి వర్మన్

ఎడిటర్:  ఫిలోమిన్ రాజ్

ప్రొడక్షన్ డిజైన్: వినేష్ బంగ్లాన్

పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

18 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago