ఘనంగా దక్షిణ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 4న థియేటర్స్ లో విడుదల

మంత్ర , మంగళ సినిమా ల తో తెలుగు చలన చిత్ర రంగం లొ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఓషో తులసిరామ్ మళ్ళీ “దక్షిణ ” మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు . కల్ట్ కాన్సెప్ట్స్ బ్యానర్ నిర్మాణం లొ అశోక్ షిండే నిర్మాత గా కబాలి ఫేమ్ సాయి ధన్షిక కథనాయాకి గా మహాభారత్ మర్డర్స్ ఫేమ్ రిషవ్ బసు మరొక ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు నటుడు శివాజి, ఆర్పి.పట్నాయక్ ముఖ్య అథితులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ…
మంత్ర సినిమాతో సంచలన విజయం సాధించిన దర్శకులు ఓషో తులసీరామ్. అప్పట్లోనే ఆ సినిమా పది కోట్లకు పైన వసూలు చేసింది. ఓషో తులసీరామ్ గారి సినిమాల్లో పాత్ర పడితే అదృష్టం అని చెప్పాలి. మంచి నిర్మాత దొరికితే గొప్ప సినిమాలు చెయ్యగల సత్తా ఉన్న దర్శకుడు ఓషో గారు. మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమా దక్షిణ, ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా తరువాత ఓషో తులసీరామ్ గారు మరిన్ని మంచి సినిమాలు చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

ఆర్పీ.పట్నాయక్ మాట్లాడుతూ….
దక్షిణ ట్రైలర్ చాలా బాగుంది, ఈ చిత్ర సంగీత దర్శకుడు బాలాజీ చాలా ప్రతిభావంతుడు, తనకు ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను, ఓషో తులసీరామ్ గారు గొప్పగా ఆలోచించే దర్శకుడు, మంత్ర సినిమా తరహాలోనే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను అన్నారు.

ఓషో తులసీరాం మాట్లాడుతూ…
నాకోసం దక్షిణ సినిమా ను సపోర్ట్ చెయ్యడానికి వచ్చిన శివాజీ గారికి కృతజ్ఞతలు. నాకు శివాజీ గారికి మంత్ర సినిమా సమయంలో ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక మంచి నటుడు అంతకంటే మంచి మనిషి శివాజీ.మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ, వెలిగొండ శ్రీనివాస్ రైటర్, ఈ సినిమాకు బెస్ట్ వర్క్ చేశారు, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అశోక్ ఈ సినిమాకు నిర్మాత, సినిమా పట్ల విపరీతమైన ఆసక్తి, మేమిద్దరం కలిసి దక్షిణ సినిమాను ఇంకా బెస్ట్ ఔట్ ఫుట్ కు తీసుకురాగలిగాం, సాయి ధన్సిక చాలా పర్ఫెక్ట్ గా నటించింది, ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.

హీరోయిన్ సాయి ధన్సిక మాట్లాడుతూ…
సొసైటీలో ఉన్న అమ్మాయిలు అందరూ స్ట్రాంగ్ గా ఉండాలి, ఇదే పాయింట్ ను దక్షిణ సినిమాలో చెప్పడం జరిగింది, ఓషో తులసీరామ్ గారు నాకు ఈ స్టొరీ చెప్పినప్పుడు షాక్ అయ్యాను, ఆశ్చర్య పోయాను. సినిమా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది, ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్న అందరికి ధన్యవాదాలు, శివాజీ గారికి, ఆర్పీ పట్నాయక్ గారికి స్పెషల్ థాంక్స్. ఒక సూపర్ థ్రిల్లర్ కు కావాల్సిన అన్ని ఎలెమెంట్స్ దక్షిణ సినిమాలో ఉన్నాయని అన్నారు.

సాయి ధన్సిక, రిషబ్ బసు, స్నేహ సింగ్, కరుణ,ఆర్నా ములెర్, మేఘన చౌదరి. మరియు నవీన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : రామకృష్ణ (ఆర్.కె), సంగీతం : బాలాజీ, నిర్మాణ సంస్థ: కల్ట్ కాన్సెప్ట్స్, నిర్మాత : అశోక్ షిండే, రచన – దర్శకత్వం : ఓషో తులసీరామ్.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago