ఘనంగా పాడేరు 12వ మైలు టీజర్ లాంచ్ కార్యక్రమం !!!

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీసులతో సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో ఎన్. కె దర్శకత్వంలో గ్రంధి త్రినాధ్ ప్రొడ్యూసర్ గా లోతేటి కృష్ణ కో ప్రొడ్యూసర్ గా సుహాన హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి అయ్యాయి, ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యే అనేక అంశాలతో దర్శకుడు ఎన్. కె ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్ర టీజర్ రిలీజ్ కార్యక్రమంలో ఘనంగా జరిగింది, ఈ ప్రోగ్రామ్ లో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సత్యం రాజేష్ మాట్లాడుతూ…
డైరెక్టర్ ఎన్.కె గారు సినిమాను బాగా డీల్ చేశారు, సినిమాను ఎక్కడా గ్యాప్ లేకుండా నిరంతరం కృషి చేస్తూ అందంగా తీర్చి దిద్దారు. నిర్మాత త్రినాధ్ గారు సినిమాను మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తీశారు, సుహాన తెలుగు రానప్పటికీ బాగా నటించింది. పాడేరు 12వ మైలు సినిమాలో నేను శ్రవణ్, ప్రభాకర్ గుర్తిండిపోయే రోల్స్ చేశాం, త్వరలో ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది, మంచి సినిమా కోసం అందరం ఎదురు చూద్దాం అన్నారు.

శ్రవణ్ మాట్లాడుతూ…
పాడేరు 12వ మైలు కథ విన్నప్పుడు చాలా నచ్చింది, పాడేరు మొదకొండమ్మ తల్లి పవర్ ను ఈ సినిమాలో చక్కగా చూపించారు. డైరెక్టర్ ఎన్. కె గారు నిర్మాత త్రినాధ్ గారు మంచి సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమాను నటించినందుకు సంతిషంగా ఉందన్నారు.

డైరెక్టర్ ఎన్. కె మాట్లాడుతూ…
నా స్నేహితుడు త్రినాధ్ నిర్మాతగా నేను డైరెక్టర్ గా మీ ముందుకు పాడేరు 12వ మైలు సినిమాతో వస్తున్నాను. సత్యం రాజేష్, ప్రభాకర్, శ్రవణ్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ మొదకొండమ్మ తల్లి ఆశీస్సులతో ఈ సినిమాను ముందుకు తీసుకొని వెళుతున్నాము. మాకు సపోర్ట్ చేస్తున్న అందరికి కృతజ్ఞతలు. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను అన్నారు.

నిర్మాత గ్రంధి త్రినాధ్ మాట్లాడుతూ…
పాడేరు 12వ మైలు సినిమా బాగ వచ్చింది, డైరెక్టర్ , యాక్టర్స్ అందరూ బాగా సపోర్ట్ చెయ్యడంతోనే మా సినిమా ఇంత కలర్ ఫుల్ గా ఉంది, శ్రీ పాడేరు మొదకొండమ్మ తల్లి బ్లెస్సింగ్స్ మా పై ఎప్పుడూ ఇలానే ఉండాలని, ప్రేక్షకులు, మీడియా వారు మా సినిమాను తప్పకుండా పాజిటీవ్ గా రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం ఉందని అన్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్ శివ శర్వాని అలాగే సినిమాటోగ్రఫీ జి. అమర్ అందిస్తున్నారు ఈ మూవీ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్నాయి. గడ్డం నవీన్, షేకింగ్ శేషు, ముకేష్ గుప్త, కె.ఏ.పాల్ రాము, సూర్య, సమీర్, చిట్టిబాబు, మురళి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.

హైదరాబాద్, వైజాగ్ మరియు పాడేరు లో అధిక భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకులను పలకరించడానికి థియేటర్స్ లోకి రానుంది. పీఆర్ ఈ సినిమాకు నేపధ్య సంగీతం అందించారు. నభ మాస్టర్ ఫైట్స్, కళాదర్ నృత్యాలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానున్నాయి.

Tfja Team

Recent Posts

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” టైటిల్ గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

14 hours ago

ఘనంగా జరిగిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కావ్య రెడ్డి రోకా వేడుక

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో కావ్య రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి రోకా వేడుక ఇరు…

14 hours ago

య‌శ్ రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆల్ఫా’.. జూలై 10న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ విడుద‌ల‌

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌లో ఆలియా భ‌ట్ న‌టిస్తోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆల్ఫా’. భారీ అంచనాలతో…

14 hours ago

“మిరాకిల్” నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్” -క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్

"కుమారి 21ఎఫ్, ఈడో రకం - ఆడో రకం, ఓదెల రైల్వే స్టేషన్" వంటి బ్లాక్ బస్టర్స్ నా కెరీర్…

20 hours ago

గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన “రాజు వెడ్స్ రాంబాయి”, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గాయకుడు, స్పెషల్ జ్యూరీ సహా నాలుగు అవార్డ్స్ దక్కించుకున్న మూవీ

కల్ట్ రూరల్ బ్లాక్ బస్టర్ మూవీగా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది "రాజు వెడ్స్ రాంబాయి". ఈ సినిమా థియేట్రికల్…

3 days ago

గద్దర్ అవార్డ్ 2025.. ‘దండోరా’లో అత్యుత్తమ నటనను కనబర్చి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా నిలిచిన శివాజీ

గ్రేట్ యాక్టర్ శివాజీకి తెలంగాణ ప్రభుత్వం బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా అవార్డుని ప్రకటించింది. తాజాగా గద్దర్ అవార్డుల లిస్ట్‌ని ప్రభుత్వం…

3 days ago