‘కోరమీను’ టీజర్ విడుదల చేసిన గోపీచంద్ మలినేని

ఆనంద్ రవి కథానాయకుడిగా ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘కోరమీను’. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ట్విట్టర్ ద్వారా శనివారం సినిమా టీజర్ విడుదల చేశారు. ‘మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?’ అంటూ కొన్ని రోజుల నుంచి వినూత్నంగా సినిమా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. టీజర్లో ఆ మీసాలు రాజు ఎవరో చెప్పారు. ”ఈ రోజు జాయిన్ అయిన మీసాల రాజు గారికి జాలరిపేటలో నిన్న రాత్రి ఎవరో మీసాలు తీసేశారని సమాచారం” అని న్యూస్ యాంకర్ వాయిస్ వినిపిస్తుంటే… స్క్రీన్ మీద మీసాల రాజుగా శత్రును చూపించారు. 

‘డబ్బుకు ఎక్కువ పవర్ అనుకుంటారు గానీ అసలైన పవర్ భయానిదేరా’ అని హరీష్ ఉత్తమన్ చెప్పే డైలాగ్, ‘ఇది జాలరిపేట. డబ్బున్నోడు, డబ్బు లేనోడు… అంతే!’ అని హీరోయిన్ కిషోరీతో ఆనంద్ రవి చెప్పే మాట… వాళ్ళ క్యారెక్టరైజేషన్లు చెప్పేలా ఉన్నాయి. ఆనంద్ రవి నటనలో ఈజ్ ఉంది. జాలరిపేట యువకుడి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. టీజర్ చివర్లో గిరిధర్, ఇమ్మాన్యుయేల్ సీన్‌తో సినిమాలో కామెడీ కూడా ఉందని హింట్ ఇచ్చారు. దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ.. ”టీజర్ విడుదల చేసిన గోపీచంద్ మలినేని గారికి థాంక్స్. కథ విషయానికి వస్తే… జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరం. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు – ఈ ముగ్గురి పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది.

మంచి కంటెంట్ తో వస్తున్న చిత్రమిది. అందరికీ నచ్చుతుంది” అని అన్నారు.కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా ‘జబర్దస్త్’ ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
 ఈ చిత్రానికి పీఆర్వో : నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి బియాండ్ మీడియా, స్టైలిష్: పూజ శేఖర్, ఎడిటర్: విజయ్ వర్ధన్ కె, పాటలు: అనంత నారాయణన్ ఏజీ, ప్రొడక్షన్స్ డిజైనర్: ముసి ఫణి తేజ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవన్ కుమార్ జన స్వామి, సినిమాటోగ్రాఫర్: కార్తీక్ కొప్పెర, సౌండ్ డిజైన్: సాయి వర్మ ముదునూరి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సిద్ధార్థ్ సదాశివుని, ప్రొడక్షన్ హౌస్: ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్, స్టోరీ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ : ఆనంద్ రవి, డైరెక్టర్: శ్రీపతి కర్రి, నిర్మాత : పెళ్లకూరు సమన్య రెడ్డి.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago