గోపి గాళ్ళ గోవా ట్రిప్ ప్రీ రిలీజ్ ఈవెంట్– ఇండిపెండెంట్ ఫిలింలో ఇది మాగ్నోపస్

తెలుగు ప్రేక్షకులు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చూడటానికి ఇష్టపడుతుంటారు. అలానే ఒరిజినాలిటీకి దగ్గరగా ఉన్న సినిమాలకి ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. అలా వచ్చిన ఎన్నో సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. ఇక తెలుగులో ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ రోహిత్ మరియు క్యాంప్ శశి గురించి ప్రత్యేకించి పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు.

వీళ్లు చేసిన ఎన్నో ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దర్శక నిర్మాతలు కూడా వీళ్ళ వర్క్ చూసి ఫిదా అవుతుంటారు. స్టోరీ డిస్కషన్స్, నిరుద్యోగ నటులు వంటి సిరీస్ వీళ్లకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం రోహిత్ మరియు శశి దర్శకత్వం వహించిన గోపిగాళ్ల గోవా ట్రిప్.

ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి డైరెక్టర్ రోహిత్ మరియు శశి , మ్యూజిక్ డైరెక్టర్ రవి నిడిమర్తి. ప్రొడ్యూసర్, నటుడు సాయికుమార్, రాజు శివరాత్రి, అజిత్ మోహన్, సాయి కుమార్, పవన్ రమేష్ హాజరయ్యారు.

డైరెక్టర్ రోహిత్ అండ్ శశి మాట్లాడుతూ…

ఈ సినిమాకి మొత్తం ముగ్గురు ప్రొడ్యూసర్లు, ఈ సినిమాను మొదటిసారి మొదలుపెట్టారు. ఈ ఐడియా చెప్పిన 15 రోజు షూటింగ్ లో ఉన్నాం. గద్వాల్ డిస్ట్రిక్ట్ లోని ఒక రిమోట్ విలేజ్ లో ఈ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇది ఒక రకమైన రూట్ ఫిలిం. హైవే మీద ట్రావెల్ చేస్తూ గోవా దాకా రీచ్ మధ్యలో షూటింగ్ చేసాం ఎక్కడ పర్మిషన్ లు కూడా లేవు. సినిమా 90% సినిమా అవుట్ డోర్ లోనే ఉంటుంది. ఇది చాలా మెమొరబుల్ షూట్. ఈ సినిమా.. చిల్డ్ బీర్ లాంటి మూవీ. ఇలాంటి మూవీని మీడియా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను అని మాట్లాడారు.

పుష్ప ఫేమ్ జగదీష్ (కేశవ) మాట్లాడుతూ…

జగదీష్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది తను నటించిన నిరుద్యోగ నటులు వెబ్ సిరీస్. దానికి రోహిత్ మరియు శశి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత పుష్ప సినిమా విపరీతమైన గుర్తింపు సాధించింది. వరంగల్ నుంచి హైదరాబాద్ కి సినిమాలు చూడడానికి వచ్చిన జగదీష్ ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో సెటిల్ అయిపోయాడు. ఈ సినిమా నవంబర్ 14న విడుదలవుతుంది అందరూ చూసి ఎంకరేజ్ చేయండి.

నటుడు సాయికుమార్ మాట్లాడుతూ…

ఈ సినిమా అనేది ఇండిపెండెంట్ ఫిలిమ్స్ లో మాగ్నమోపస్ లాంటిది. అంటూ ఎలివేషన్ తెలిపాడు. ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ అందరూ ఎంకరేజ్ చేయాలి అని కోరుకున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ రవి నిడిమర్తి. ప్రొడ్యూసర్ మరియు నటుడు సాయికుమార్, రాజు శివరాత్రి, అజిత్ మోహన్, సాయి కుమార్, పవన్ రమేష్ ఈ ఈవెంట్లో మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చింది. మా సినిమాను ఎంకరేజ్ చేయాలి అని ఆడియన్స్‌ ను కోరారు.

‘గోపి గాళ్ల గోవా ట్రిప్’ సినిమాను రాస్తా ఫిల్మ్స్, ఔరాఉలిస్ ఆర్ట్స్, అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా సంయుక్తంగా నిర్మించారు. అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. సాయి కుమార్, సీతా రామరాజు, రమణా రెడ్డి నిర్మాణంలో రోహిత్ & శశి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నవంబర్ 14న ఏ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago