హీరో వెంకట్ నటించిన హరుడు చిత్రం గ్లింప్స్ విడుదల

శివరామరాజు ఫేమ్ వెంకట్ తొలిసారి మాస్ హీరోగా నటిస్తున్న చిత్రం హరుడు. ఈట ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తాళ్ళూరి దర్శకుడు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్న హరుడు చిత్రం గ్లింప్స్ శనివారంనాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు.

అనంతరం ఈట ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ,   సినిమా ఈ స్థాయికి రావడానికి కారణం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. ఈ సినిమా దర్శకుడు రాజ్ తాళ్లూరి రాత్రింబవళ్ళు పనిచేశారు. హీరో వెంకట్, శ్రీహరి, సలోని, హెబ్బా పటేల్ నటించారు. ఇందులోని పాటలు ఆదరణ పొందేలా వున్నాయి. జెన్నా పాటలకు సంగీతం బాగా సమకూర్చారు. ఈరోజు విడుదలైన గ్లింప్స్ చాలా బాగున్నాయి. మంచి విజయం సాధించాలని కోరుకుంటన్నా అన్నారు.


దర్శకుడు రాజ్ తాళ్ళూరి  మాట్లాడుతూ, ముందుగా నిర్మాత చైతన్యకు థ్యాంక్స్. ఐదు నిముషాల్లోనే కథ విని ఓకే చేశారు. వెంకట్ గారితో ఐదేళ్ళ జర్నీ వుంది. లవర్ బాయ్ గా చేసిన ఆయన మాస్ హీరోగా ఇందులో చేశారు. నటశాసింగ్  కూడా నటించింది. సంగీత దర్శకుడు జిన్నా, ఎడిటర్ మారుతీ బాగా పనిచేశారు. నాకు దర్శకుల టీమ్ సపోర్ట్ గా వుండడంతో అవుట్ పుట్ బాగా వచ్చింది అన్నారు.

హీరో వెంకట్ మాట్లాడుతూ, హరుడు చిత్రం కమర్షియల్ ఎలిమెంట్ తో మాస్ ఎంటర్ టైనర్ గా వుంటుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా 60 శాతం పూర్తయింది. నిర్మాత డాక్టర్ అయినా సినిమా పై తపనతో వచ్చారు. ఆయనకు మంచి హిట్ పడాలని ఆశిస్తున్నాను. నాకు పవర్ ఫుల్ రోల్ దర్శకులు ఇచ్చారు. మాస్ పాత్ర నేను మొదటిసారి చేశాను. నా పాత్రకు ధీటుగా హెబ్బాపటేల్ పాత్ర వుంటుంది. డబ్బింగ్ లో ఆమె నటన చూశాను. అలాగే నటశాసింగ్ మరో పాత్ర చేసింది. స్పెషల్ సాంగ్ లో సలోని చేశారు. ఇందులో ఐదు పాటలున్నాయి. సంగీత దర్శకుడు మణిజెన్నా మంచి బాణీలు ఇచ్చారు. మాస్ సినిమాకు ఫైట్స్ కీలకం. శివరాజ్ మాస్టర్ బాగా కంపోజ్ చేశారు. లోగడ షూటింగ్ లో నాకు గాయాలు అయ్యాయి. అందుకే కొంత గేప్ కూడా తీసుకున్నాను. ఈ సినిమాలో తగు జాగ్రత్తలు తీసుకుని ఫైట్స్ చేశాను. వచ్చే నెలలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

6 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago