గెటప్ శ్రీను రాజు యాదవ్ “లేదే లేదే ప్రేమసలే” పాట విడుదల

సాయి వరుణవి క్రియేషన్స్, ఖరిష్మ డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై  గెటప్ శ్రీను హీరో గా రూపొందిన చిత్రం “రాజు యాదవ్ “. నిజ జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా  రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి . కె దర్శకుని గా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారా మే 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్బంగా రాజు యాదవ్ టీం ప్రమోషన్స్ విషయంలో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది.

రీసెంట్ గా హనుమాన్ సినిమా తో ప్యాన్ ఇండియా హీరో గా ఎదిగిన సూపర్ హీరో “తేజ్ సజ్జా” చేతులు మీదగా విడుదలైన ట్రైలర్ కి అధ్బుతమైన రెస్పాన్స్ వస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో వుంది.

ఇప్పుడు రాజు యాదవ్ టీం నుండి మరో సాంగ్ రిలీజ్ చేశారు. నాటు నాటు పాటతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించి ఆస్కార్ అవార్డు అందుకున్న అక్షర తపస్వి చంద్ర బోస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన సాహిత్యం అందించి, స్వయంగా ఆయనే పాడిన “లేదే లేదే ప్రేమసలే” పాటని విడుదల చేశారు.  

చంద్ర బోస్ గారి గొంతుతో ఈ పాట వింటున్న కొద్ది మన గుండె బరువెక్కుతుంది. అత్యంత సహజంగా,వాడుక భాషలో గుండెకి హత్తుకునేలా పాట  రాయడం అంటే ఒక్క చంద్ర బోస్ గారికే చెల్లుతుంది అని మరోసారి ప్రూవ్ చేసారు. ఈ సాహిత్యానికి తగ్గట్టు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఇచ్చిన మ్యూజిక్ పాట విన్న వారిని మళ్ళీ మళ్ళీ వినేలా మ్యూజిక్ కంపోజ్ చేసారు.  

చిత్ర నిర్మాతలైన ప్రశాంత్ రెడ్డి , రాజేష్ కల్లెపల్లి మాట్లాడుతూ ఇప్పటివరకు మా సినిమా నుండీ విడుదలైన ప్రతి కంటెంట్ ప్రేక్షకులని మెప్పించిందని.. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ మా సినిమా మీద మాకు మరింత నమ్మకం కలిగించిందని, చిన్న సినిమాగా మొదలైనా మా సినిమాని ఇంతమంది సినీ ప్రముఖులు, మీడియా వ్యక్తులు సపోర్ట్ చెయడం తో మాకు చాలా సంతోషంగా వుందని, ఖచ్చితంగా మీ మా అంచనాలను దాటి పెద్ద హిట్ అవుతుందని, త్వరలోనే భారీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామని చెప్పారు.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago