జ‌న‌వ‌రి 1న ‘గేమ్ చేంజర్’ ట్రైల‌ర్ రిలీజ్క నిర్మాత దిల్ రాజు

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు ఆర్‌సీ యువశక్తి ఆధ్వర్యంలో విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్‌ను ఆవిష్కరించారు. 256 అడుగుల ఎత్తైన ఈ కటౌట్ లాంచ్ ఈవెంట్‌కు దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం..

ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ ట్రైలర్ నా ఫోన్‌లో ఉంది. కానీ అది మీ (ఆడియెన్స్) వద్దకు రావాలంటే ఇంకా మేం చాలా పని చేయాల్సి ఉంది. ఇప్పుడు ట్రైలర్‌లే సినిమా స్థాయిని నిర్ణయిస్తున్నాయి. అందుకే ఈ ట్రైలర్‌ను కొత్త ఏడాది సందర్భంగా అంటే జనవరి 1న మీ ముందుకు తీసుకు వస్తున్నాం. సినిమా అంటేనే విజయవాడ. ఇక్కడ రామ్ చరణ్ భారీ కటౌట్‌ను రివీల్ చేయడం ఆనందంగా ఉంది. చిరంజీవి గారి మీద 40, 50 ఏళ్ల నుంచి మీ అభిమానం అలానే ఉంటోంది. చిరంజీవి నుంచి మనకు పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, బన్నీ, సాయి ధరమ్ తేజ్ ఇలా చాలా మందిని అందించారు. ఇలా అందరికీ మెగా ఫ్యాన్ సపోర్ట్ ఉంటూనే వస్తోంది. అమెరికాలో చేసిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఈవెంట్ చేయాలని అనుకుంటున్నాం. ఆ విషయం గురించి మాట్లాడేందుకు ఇక్కడకు వచ్చాను. ఆయన ఇచ్చే డేట్‌ను బట్టి ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ? అనేది ఫిక్స్ అవుతాం. ఈ ఈవెంట్ మాత్రం మామూలుగా ఉండకూడదు.

చరిత్ర క్రియేట్ చేసేలా ఉండాలి. ఇటు వచ్చే ముందే చిరంజీవి గారికి ఫోన్ చేశాను. అప్పుడు సినిమా చూశారు కదా.. ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయింది.. మరోసారి సినిమా చూడండి అని అడిగాను. వాళ్లు అక్కడ సినిమా చూడటం స్టార్ట్ చేశారు. నేను ఇక్కడకు బయల్దేరాను. ఇక్కడకు వచ్చిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేశారు. ఈ సంక్రాంతికి మామూలుగా కొట్టడం లేదు అని ఫ్యాన్స్‌కు చెప్పండి అని చిరంజీవి గారు అన్నారు. మెగా పవర్ స్టార్‌లో మెగాని, పవర్‌ని చూస్తారు. నాలుగేళ్ల క్రితం శంకర్ గారు కథ చెప్పినప్పుడు ఏం ఫీల్ అయ్యానో.. చిరంజీవి గారు ఒక్కో సీన్ గురించి చెబుతూ ఉంటే అదే ఫీల్ అయ్యాను. చాలా సంతోషంగా అనిపించింది.

జనవరి 10న మీరు రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని చూడబోతోన్నారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా, కొద్ది సేపు పోలీస్ ఆఫీసర్‌గా, ఇంకొద్ది సేపు రాజకీయ నాయకుడిగా కనిపించబోతోన్నారు. శంకర్ మార్క్ కచ్చితంగా కనిపిస్తుంది. ఐదు పాటలు బిగ్ స్క్రీన్ మీద దేనికదే అన్నట్టుగా ఉంటుంది. 2 గంటల 45 నిమిషాలు మాత్రమే ఉండాలని నిడివి విషయంలోనూ శంకర్ గారితో మాట్లాడాను. అంతే నిడివిలో శంకర్ గారు అద్భుతంగా కట్ చేసి ఇచ్చారు. సినిమా పరిగెడుతూనే ఉంటుంది. సినిమాలో అన్ని అంశాలు ఉంటూనే అన్ ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది. ఎస్ జే సూర్య, రామ్ చరణ్ సీన్లతో థియేటర్లు దద్దరిల్లుతాయి. జనవరి 1న ట్రైలర్ రానుంది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే డేట్‌ను బట్టి జనవరి 4 లేదా 5 ఏపీలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జనవరి 10న సినిమా రాబోతోంది. ఈ సంక్రాంతిని గట్టిగా సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి’ అని అన్నారు.

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

1 day ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

1 day ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

1 day ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

1 day ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

1 day ago

‘దేఖ్‌లేంగే సాలా’ పాటతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిన దర్శకుడు హరీష్ శంకర్

శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…

1 day ago