నార్త్ ఇండియాలో “గేమ్ ఛేంజర్” పంపిణీ హక్కుల్ని సొంతం చేసుకున్న AA ఫిల్మ్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మీదున్న అంచనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఫ్యాన్సీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఇది రామ్ చరణ్ కెరీర్‌లోనే హయ్యస్ట్. భారీ రేటుకే నార్త్‌లో గేమ్ చేంజర్ అమ్ముడైపోయింది.

ప్రఖ్యాత దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన “గేమ్ ఛేంజర్” కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. జనవరి 10, 2025న సంక్రాంతికి ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన “జరగండి”, “రా రా మచ్చ” అనే రెండు ఎలక్ట్రిఫైయింగ్ పాటలు శ్రోతలను తెగ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం నుంచి రావాల్సిన టీజర్, ట్రైలర్ మరియు మిలిగిలిన పాటలు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

“గేమ్ ఛేంజర్” ప్రీ-రిలీజ్ బిజినెస్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీని నార్త్‌లో అనిల్ తడాని AA ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ చేయబోతోన్నారు. ఉత్తర భారతదేశ పంపిణీ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు ఈ మేరకు మేకర్స్ ప్రకటించారు. ఇక నార్త్‌లో ఈ చిత్రాన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయబోతోన్నారు.

“గేమ్ ఛేంజర్”లో రామ్ చరణ్ నిజాయితీగా గల ఐఏఎస్ అధికారిగా, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడే రాజకీయ నాయకుడిగా కనిపించబోతోన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా, తెలుగు నటి అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఎడిటింగ్‌ను బాధ్యతను ప్రఖ్యాత ద్వయం షమ్మర్ ముహమ్మద్, రూబెన్ నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్, న్యూజిలాండ్, ఆంధ్రప్రదేశ్, ముంబై, చండీగఢ్‌తో సహా విభిన్న ప్రదేశాలలో  షూట్ చేసిన “గేమ్ ఛేంజర్” విజువల్ వండర్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన పవర్ ఫుల్ స్టోరీకి శంకర్ తన విజన్‌ను జోడించి భారీ ఎత్తున తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

2 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

2 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

2 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

2 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

2 days ago