‘ఆయ్’ నుంచి హరి పాత్రలో అంకిత్ కొయ్య ఫన్నీ వీడియో

ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.

సినిమా ప్రమోషన్స్‌ను సరికొత్త పంథాలో చేస్తూ చిత్ర యూనిట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల టైటిల్ రివీల్‌కు సంబంధించిన కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవటమే కాకుండా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంది.. అలాగే ఫస్ట్ లుక్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. అలాగే అంద‌రినీ ఆక‌ట్టుకునేలా మెలోడి ఆఫ్ ది సీజ‌న్ అనిపించేలా విడుదల చేసిన సూఫియానా పాటకు మంచి స్పందన వచ్చింది. అదే క్రమంలో తాజాగా సినిమా నుంచి ఓ ఫన్నీ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

సినిమాలో హీరో ఫ్రెండ్‌గా నటించిన అంకిత్ కొయ్య పాత్రకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఇందులో అంకిత్ హరి అనే పాత్రలో నటించారు. ఊర్లోకి డాన్స్ చేయటానికి చాందిన అనే అమ్మాయి వస్తుందని పోలీస్ స్టేషన్ లో ఉన్న హరికి తెలుస్తుంది. అదే సమయంలో పోలీసుల పర్మిషన్ ఉంటేనే ఆమె డాన్స్ చేస్తుందనే విషయం తెలియగానే ఫ్రస్టేషన్ తో తన మనసులో బాధనంతా వెల్లగక్కుతాడు. కోళ్ల పందెలకు, స్టేజ్ డాన్సులకు పోలీసుల పర్మిషన్ ఎందుకు తీసుకోవాలంటూ నానా హంగామా చేస్తాడు. ఎవరైతే ఎలాంటి అంక్షలు లేకుండా కోళ్ల పెందెల, స్టేజ్ డాన్సులకు పర్మిషన్ ఇస్తారో వాళ్లకే ఈసారి ఓటేస్తామంటూ అక్కడున్న వారిని రెచ్చగొడతాడు హరి. వీడియో చాలా ఫన్నీగా ఉంది. హరి పాత్రలో అంకిత్ కొయ్య నటన సింప్లీ సూపర్బ్. నటుడిగా అంకిత్‌ను ‘ఆయ్’ సినిమా కొత్త కోణంలో ఆవిష్కరించనుందనటంలో సందేహం లేదని వీడియో చూస్తుంటే అర్థమవుతుంది.

‘ఆయ్’ సినిమాను ప్రారంభం నుంచి సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది టీమ్‌లో మరింత కాన్ఫిడెన్స్‌ను నింపుతోంది. ఈ డిఫరెంట్ ప్రమోషనల్ యాక్టివిటీస్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ  సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.

GA2 పిక్చర్స్:

 ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి.

నటీనటులు:  నార్నే నితిన్, నయన్ సారిక తదితరులు

సాంకేతిక వర్గం:

బ్యానర్ – GA2 పిక్చర్స్
సమర్పణ – అల్లు అరవింద్
నిర్మాతలు – బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
డైరెక్టర్ – అంజి కంచిపల్లి
సహ నిర్మాతలు – భాను ప్రతాప్, రియాజ్ చౌదరి
సినిమాటోగ్రఫీ – సమీర్ కళ్యాణి
సంగీతం – రామ్ మిర్యాల
ఎడిటర్ – కోదాటి పవన్ కళ్యాణ్
ఆర్ట్ డైరెక్టర్ – కిరణ్ కుమార్ మన్నె
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అజయ్ గద్దె
కాస్ట్యూమ్స్ – సుష్మిత, శిల్ప
కో డైరెక్టర్ – రామ నరేష్ నున్న
పి.ఆర్.ఒ – వంశీ కాకా
మార్కెటింగ్ – విష్ణు తేజ్ పుట్ట
పోస్టర్స్ – అనిల్, భాను

Tfja Team

Recent Posts

యంగ్‌ టీమ్‌ ఎనర్జీతో రూపొందించిన ‘శ్రీ చిదంబరం గారు’ బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను: లెజెండరీ మ్యూజిక్‌ డెరెక్టర్‌ ఎమ్‌.ఎమ్‌.కీరవాణి

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…

11 hours ago

అంగరంగ వైభవంగా “సుమతీ శతకం” ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ – టికెట్ ధర కేవలం 100,150 మాత్రమే

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…

11 hours ago

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ “కిల్లర్” నుంచి పవర్ ఫుల్ విలన్ మనీష్ గిలాడ క్యారెక్టర్ లుక్ రిలీజ్

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…

11 hours ago

ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “స్కై”

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…

11 hours ago

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ భేటీ: ‘పద్మశ్రీ’ వచ్చినందుకు ఘన సత్కారం

ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…

1 day ago