వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయిక.
ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెడుతోన్న ‘ఫంకీ’ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకొని అంచనాలను రెట్టింపు చేశాయి. మరికొద్ది గంటల్లో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించడానికి ‘ఫంకీ’ వస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ ‘ఫంకీ’ చిత్రం ప్రేక్షకులకు వినోదాల విందుని అందించి, ఘన విజయాన్ని సాధిస్తుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది.
‘ఫంకీ’ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ..”ముందుగా భీమ్స్ గారి గురించి మాట్లాడాలి. మా సినిమాకు అద్భుతమైన సంగీతం అందించారు. మామూలుగా నా సినిమాల్లో పాటలు బాగుంటాయి అంటారు. అయితే నా గత రెండు చిత్రాలలో పాటలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ఇప్పుడు ‘ఫంకీ’ సినిమాకి భీమ్స్ గారు అన్నీ మంచి పాటలు ఇచ్చారు. సినిమా విడుదల తర్వాత పాటలకు ఆదరణ ఇంకా పెరుగుతుందనే నమ్మకం ఉంది. రేపు(ఫిబ్రవరి 13) ఫంకీ థియేటర్లలోకి వస్తోంది. స్నేహితులు, కుటుంబం సభ్యులతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. రెండు గంటలు ఎలా అయిపోయాయో కూడా తెలియనంతగా సినిమా మీకు వినోదాన్ని పంచుతుంది.” అన్నారు.
కథానాయిక కయాదు లోహర్ మాట్లాడుతూ..”ఫంకీ ఎలా ఉండబోతుందో ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయింది. మా సినిమాని మీకు చూపించడం కోసం ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్నాము. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాత నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. దర్శకుడు అనుదీప్ గారితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా నేను పని చేసిన దర్శకులలో అనుదీప్ గారిది విభిన్న శైలి. విశ్వక్ సేన్ అద్భుతమైన నటుడు. ఎంతో ప్రతిభ ఉంది. చాలా కూల్ గా ఉంటాడు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఈ స్థాయికి ఎదగటం అంటే మామూలు విషయం కాదు. ఫంకీ నా కెరీర్ లో మొదటి కామెడీ సినిమా. ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఫిబ్రవరి 13న విడుదలవుతున్న మా సినిమాని కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయండి.” అన్నారు.
దర్శకుడు అనుదీప్ కె.వి. మాట్లాడుతూ..”ముందుగా మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు. కథ వినగానే ఈ సినిమా చేయడానికి అంగీకరించిన విశ్వక్ సేన్ కి కృతఙ్ఞతలు. కయాదు లోహర్ కి తెలుగు రాకపోయినా.. అప్పటికప్పుడు ఏవైనా డైలాగులు రాసినా నేర్చుకొని చెప్పింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. భీమ్స్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. నవీన్ నూలి గారు తన ఎడిటింగ్ తో సినిమాని ఇంకా బెటర్ చేశారు. కెమెరామ్యాన్ సురేష్ గారు, సహ రచయిత జగన్, అలాగే చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఫిబ్రవరి 13న ఫంకీ విడులవుతోంది. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు కుటుంబంతో కలిసి సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.” అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..“సినీ నేపథ్యంలో జరిగే కథ ఇది. అలా అని సీరియస్ గా ఉండదు. దర్శకుడికి, నిర్మాత కూతురికి మధ్య జరిగే సరదా కథ ఇది. క్యూట్ కామెడీ ఫిల్మ్. ప్రతి సన్నివేశం హాయిగా నవ్వుకునేలా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు రెండు గంటల పాటు మీ ముఖంలో నవ్వు ఉంటుంది. నవ్వుకోడానికి థియేటర్ కి రండి. మీరు అసలు నిరాశచెందరు. నవ్వుతూ థియేటర్ నుండి బయటకు వస్తారు.” అన్నారు.
చిత్రం: ఫంకీ
తారాగణం: విశ్వక్ సేన్, కయాదు లోహర్, నరేష్, వీటీవీ గణేష్ తదితరులు
దర్శకత్వం: అనుదీప్ కె.వి.
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: సురేష్ సారంగం
రచన: అనుదీప్ కె.వి, మోహన్
కళా దర్శకుడు: జానీ షేక్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ…
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో…
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ…
ప్రేక్షకులకి వేలంటైన్స్ డే విషెస్ చెబుతూ.. ఫిబ్రవరి 13 న “స్కై” మూవీని మేకర్స్ ధియేటర్ రిజీజ్ చేస్తున్నారు. మురళీ…