టాలీవుడ్

ఏప్రిల్ 3, 2026న థియేటర్లలో ‘ఫంకీ’ నవ్వుల తుఫాను

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఫంకీ’. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర విడుదల తేదీ వచ్చేసింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకులు ఇచ్చిన అద్భుతమైన స్పందనతో ఉత్సాహంలో ఉన్న ‘ఫంకీ’ చిత్ర బృందం, ఈ సినిమాను 2026 ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. టీజర్ తో వినోదాల విందుకి హామీ ఇచ్చిన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వినోదభరిత చిత్రాలలో ఒకటిగా ‘ఫంకీ’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

‘ఫంకీ’ సినిమా కోసం స్వచ్ఛమైన వినోదాన్ని అందిస్తూ, ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తే అద్భుతమైన బృందం ఒకచోట చేరింది. దర్శకుడు కె.వి. అనుదీప్ తన శైలి కామెడీ విందుతో తిరిగి వచ్చారు. ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. అనుదీప్ దర్శకత్వం అంటే వినోదం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ‘జాతిరత్నాలు’ సినిమాతో సంచలనాలు సృష్టించిన ఆయన.. మరోసారి విభిన్నమైన కథాంశం, కట్టిపడేసే హాస్యంతో ప్రేక్షకుల మనసు దోచుకోనున్నారు.

‘ఫంకీ’ చిత్రంలో విశ్వక్ సేన్ సినీ దర్శకుడి పాత్రను పోషిస్తుండటం విశేషం. కొత్త లుక్, కొత్త యాటిట్యూడ్‌తో ప్రేక్షకులను సరికొత్తగా అలరించనున్నారు. ఇప్పటికే టీజర్‌లో ఆయన నటన, ఎనర్జీ, కామెడీ టైమింగ్ కి ప్రశంసల వర్షం కురిసింది. ఈ సినిమాలో కయాదు లోహర్‌ కథానాయికగా నటిస్తున్నారు. టీజర్ లో తన అందంతో కట్టిపడేశారు. తెరపై విశ్వక్-కయాదు జోడి కొత్తగా, అందంగా కనిపిస్తూ.. యువత మనసు దోచుకుంటోంది.

సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది. అద్భుతమైన గీతాలు, నేపథ్య సంగీతంతో భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థల నుంచి వస్తున్న సినిమా కావడంతో, ‘ఫంకీ’పై సహజంగానే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘ఫంకీ’ చిత్రం ప్రేక్షకులకు నవ్వుల విందుని అందిస్తుందని చిత్ర బృందం హామీ ఇచ్చింది.

ఏప్రిల్ 3, 2026న థియేటర్లలో నవ్వుల తుఫాను రాబోతోంది. ‘ఫంకీ’ నవ్వుల తుఫాను కోసం సిద్దంగా ఉండండి.

చిత్రం: ఫంకీ
తారాగణం: విశ్వక్ సేన్, కయాదు లోహర్‌
రచన, దర్శకత్వం: అనుదీప్ కె.వి.
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: సురేష్ సారంగం
రచనా సహకారం: మోహన్
సహ నిర్మాత: వెంకట్ ఉప్పుటూరి
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

2 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago