FNCC ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ – 10 లక్షల ప్రైజ్ మనీ

Must Read

ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్, హైదరాబాద్ – ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 20, 2024
ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్, ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (AITA) మరియు తెలంగాణ స్టేట్ టెన్నిస్ అసోసియేషన్ (TSTA) సహకారంతో FNCC ఆల్ ఇండియా మెన్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఇది టెన్నిస్ మరియు క్రీడాస్ఫూర్తి యొక్క అద్భుతమైన ప్రదర్శనను అందిస్తుంది. FNCC కి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది, ఎందుకంటే ఇటువంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్ను FNCC నిర్వహించడం ఇదే మొదటిసారి.


హీరో నాగ శౌర్య, అర్జున్ అవార్డు గ్రహీత సాకేత్ మైనేని గౌరవనీయ ప్రముఖులతో కలిసి ప్రారంభోత్సవ వేడుక నిర్వహించారు. FNCC క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ జి ఆది శేషగిరిరావు గారు, శ్రీ చాముండేశ్వరి నాథ్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ FNCC మరియు సెక్రటరీ శ్రీ ముళ్లపూడి మోహన్, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వైస్ ప్రెసిడెంట్ శ్రీ తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీ శ్రీ V.V.S.S పెద్ది రాజు, మరియు కమిటీ సభ్యులు శ్రీ కాజా సూర్యనారాయణ , , శ్రీ ఏడిద సతీష్ (రాజా), టీఎస్టీఏ అధ్యక్షుడు కే. ఆర్. రామన్, టీ ఎస్ టీ ఏ ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్, టీ ఎస్ టీ ఏ కార్యదర్శి వెల్మటి నారాయణదాస్ ,జగదీష్ గారు, మధుగారు, సందీప్ గారు రామరాజు గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా FNCC ప్రెసిడెంట్ ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ : గతంలో కూడా FNCC నుంచి చాలా కార్యక్రమాలు చేసాము. ఇప్పుడు ఈ టెన్నిస్ టోర్నమెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మాకు సపోర్ట్ చేసి ముందుకొచ్చిన మా స్పాన్సర్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా షూటింగ్లో బిజీగా ఉండి కూడా అడగ్గానే మా మనవిని మన్నించి ఈవెంట్ కి విచ్చేసిన హీరో శ్రీ నాగ శౌర్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు.

హీరో శ్రీ నాగ శౌర్య గారు మాట్లాడుతూ : ఈ సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు నేను కూడా ఒక టెన్నిస్ ప్లేయర్ని. స్టేట్ లెవెల్ టోర్నమెంట్ వరకు ఆడాను. ఇండస్ట్రీలోకి వచ్చి టెన్నిస్ కి దూరమయ్యాను. ఇప్పుడు FNCC తరఫున ఇలాంటి టోర్నమెంట్స్ పెట్టి స్పోర్ట్స్ పర్సన్స్ ని ఎంకరేజ్ చేయడం చాలా మంచి విషయం. ఈవెంట్ కి నన్ను గెస్ట్ గా పిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈవెంట్ లో నన్ను కూడా భాగం చేసినందుకు అది శేషగిరిరావు గారికి, ముళ్ళపూడి మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆటగాళ్లందరూ ఈవెంట్ కోసం ఎంత ఎక్సయిటెడ్ గా ఉన్నారో తెలుస్తోంది. ఈ టోర్నమెంట్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ బాగా ఆడాలని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

FNCC మాజీ ప్రెసిడెంట్ కేల్ నారాయణ గారు మాట్లాడుతూ : FNCC తరపున స్పోర్ట్స్ ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. బెస్ట్ టెన్నిస్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, షటిల్ కోడ్స్ ఇవన్నీ కూడా ట్విన్ సిటీస్ లో మన దగ్గరే ఉన్నాయి. స్పోర్ట్స్ COMMITTEE CHAIRMAN చాముండేశ్వరి నాథ్ గారు స్పోర్ట్స్ పర్సన్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా మంచి విషయం. ఇక మీదట కూడా ఇలాంటి టోర్నమెంట్స్ అలాగే స్పోర్ట్స్ పీపుల్ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా అర్జున అవార్డు అలాగే స్పోర్ట్స్ టోర్నమెంట్స్ లో అవార్డ్స్ గెలిచిన వాళ్లని మెంబర్షిప్స్ అందించడం సపోర్ట్ చేయడం చేశాం. ఇంక ముందు కూడా ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తాము స్పోర్ట్ పీపుల్ ని సపోర్ట్ చేస్తాము అని అన్నారు.

FNCC స్పోర్ట్స్ COMMITTEE CHAIRMAN చాముండేశ్వరి నాథ్ గారు మాట్లాడుతూ : ఈ రోజున ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం దీంట్లో ఎంతోమంది స్పోర్ట్స్ పీపుల్ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. FNCC నుంచి ముందు ముందు ఇంకా ఇలాంటి ఎన్నో టోర్నమెంట్స్ జరిపిస్తాము. ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో శ్రీ నాగశౌర్య గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా మాకు సపోర్ట్ చేస్తున్న స్పాన్సర్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అన్నారు.

FNCC సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ గారు మాట్లాడుతూ : ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ తరఫున నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ టోర్నమెంట్ కి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. టాప్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. మాకు స్పాన్సర్ చేసి సపోర్ట్ చేస్తున్న సురన్ లైఫ్ సైన్సెస్ చైర్మన్ వెంకట్ జాస్తి గారికి, హెచ్ ఈ ఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎం.డి ఐ. వి. ఆర్. కృష్ణంరాజు గారికి, హెల్త్ ఆన్ అస్ చైర్మన్ పి. శివకృష్ణ గారికి, లెజెండ్ బిల్డర్స్ నాగేశ్వరరావు గారికి, తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ వి. నారాయణ దాస్ గారికి, తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ రావు గారికి, తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామన్ గారికి కృతజ్ఞతలు. మా ఫార్మర్ సెక్రెటరీ సోమరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. స్పాన్సర్ విషయాల్లో గాని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మాకు పక్కనే ఉండి ఎప్పుడూ కూడా సోమరాజు గారు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మరి టెన్నిస్ ప్లేయర్స్ అందరికీ కూడా పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా జగదీష్ గారు, మధుగారు, సందీప్ గారు రామరాజు గారు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇవాళ అనగా 6వ తారీఖున మొదలైన పురుషుల టోర్నమెంట్స్ 12వ తారీకు వరకు జరుగుతాయి. 13వ తారీకు నుంచి ఉమెన్స్ టోర్నమెంట్ మొదలై 19వ తారీకు వరకు జరుగుతాయి. ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.

Latest News

Raghavendra Rao unveiled the glimpses of the movie Abhimani

Film journalist and producer Suresh Kondeti has become very popular on social media. Having already entertained audiences with several...

More News