‘మిస్టర్ బచ్చన్’ నుంచి ఫస్ట్ సింగిల్ సితార్  రిలీజ్

డైరెక్టర్ హరీష్ శంకర్ కు మ్యూజిక్ లో మంచి టేస్ట్ వుంది, ఆయన సినిమాలు థియేటర్లలో విడుదలకు ముందే మ్యూజికల్ గా హిట్ అయ్యాయి.  మాస్ మహారాజా రవితేజతో ప్రస్తుతం హరీష్ శంకర్ చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ కూడా డిఫరెంట్ జానర్‌లతో కూడిన ఆల్బమ్‌. ప్రోమోతో ఆదరగొట్టిన తర్వాత, మేకర్స్ ఫస్ట్ సింగిల్- సితార్ లిరికల్‌ వీడియోని రిలీజ్ చేశారు.

సుబ్రమణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేష్ తర్వాత మిక్కీ జె మేయర్ మళ్లీ హరీష్ శంకర్‌తో జతకట్టారు. ఈ పాట సితార్ సౌండ్స్ తో ప్రారంభమవుతుంది, ఇది మ్యాజిక్ బీట్‌లతో కూడిన కంప్లీట్ క్లాసికల్ నెంబర్. కెవ్వు కేక,  అస్మైక యోగ అనే రెండు చార్ట్‌బస్టర్‌ల తర్వాత, హరీష్ , లిరిక్ రైటర్ సాహితీ రీయూనిట్ లో వచ్చిన ఈ పాట మెస్మరైజింగ్ లిరిక్స్ తో ఆకట్టుకుంది.  

ట్రాక్‌కి అందించిన పదాలు జెమ్స్, సాకేత్ కొమండూరి, సమీర భరద్వాజ్ వోకల్స్ అద్భుతంగా వున్నాయి. అలాగే, చారులత మణి  క్లాసిక్ రాగం ట్రూలీ క్లాసికల్. బ్యాక్ పాకెట్, హిప్ మూవ్‌లు ఎలిగెంట్ గా వున్నాయి.  

రవితేజ స్టైలిష్ ఎటైర్ లో యంగ్ అండ్ డాషింగ్‌గా కనిపించారు. భాగ్యశ్రీ బోర్స్ గ్లామరస్ దివాలా ఆకట్టుకుంది. వీరిద్దరూ ఆకట్టుకునే  కెమిస్ట్రీని పంచుకున్నారు. రవితేజ డ్యాన్స్ మూమెంట్స్ ఎక్స్ లెంట్ గా వుండగా  భాగ్యశ్రీ తన ఎలిగెంట్ మూమెంట్స్ తో మెస్మరైజ్ చేసింది. శేఖర్ మాస్టర్ తన అద్భుతమైన కొరియోగ్రఫీతో విజువల్స్‌కి మరింత ఎలిగెన్స్ తీసుకొచ్చారు.

అయాంకా బోస్ విజువల్స్ చాలా ఎనర్జిటిక్ అండ్ బ్యుతీఫుల్ గా వున్నాయి.  కాశ్మీర్ లోయలోని ఎక్సోటిక్ లొకేషన్లను చాలా ఆకర్షణీయంగా చూపించారు. సితార్ ఇన్స్టంట్ హిట్, బిగ్ స్క్రీన్‌పై చూసినప్పుడు పాట మరింత మెస్మరైజ్  చేస్తుంది.

ఈ సినిమాలో జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. నామ్ తో సునా హోగా అనేది సినిమా ట్యాగ్ లైన్. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి కాగ, ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి.

త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సమర్పణ: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: అయనంక బోస్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాసరాజు

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago