బెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’: మహేష్ బాబు

 
రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’. ప్రేక్షకుల విశేష ఆదరణతో ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇటువంటి విజవంతమైన, చక్కటి కుటుంబ వినోదాత్మక సినిమా తీసినందుకు ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ చిత్ర బృందాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు అభినందించారు. చిత్ర బృందం మీద ప్రశంసలు కురిపించారు.

మంచి సినిమాలకు మద్దతు ఇవ్వడంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ ఓ అడుగు ముందుంటారు. సినిమాలో ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడంతో పాటు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. తాజాగా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాకు మహేష్ బాబు రివ్యూ ఇచ్చారు.    

ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి వినోదాత్మక చిత్రాల్లో ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ఒకటి అని సూపర్ స్టార్ మహేష్ బాబు తెలిపారు. ‘హిలేరియస్ రైడ్’ అంటూ సినిమాకు షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ ఇచ్చారు. తన ట్వీట్‌లో సమర్పకురాలు తబితా సుకుమార్, చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. మహేష్ ట్వీట్ చూస్తే… ఆయన సినిమాను చాలా ఎంజాయ్ చేసినట్టు అర్థం అవుతోంది. ఆయన ప్రశంసలతో ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ చిత్ర బృందం అమితానందంలో ఉంది.  

లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమా తబితా సుకుమార్ సమర్పణలో విడుదలైంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతరం సైతం ఈ సినిమాను ఎంజాయ్ చేస్తోంది. థియేటర్లలో నవ్వుల పండగ స్పష్టంగా కనబడుతోంది. ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున విడుదల చేసింది.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

2 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

2 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

2 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

2 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

2 days ago