చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సిల్క్ శారీ . ప్రముఖ హీరో గా వెబ్ సిరీస్ లో మంచి గుర్తింపు తెచ్చుకొన్న వాసుదేవ్ రావు హీరో గా రీవా చౌదరి మరియు ప్రీతీ గోస్వామి హీరోయిన్స్ గా టి . నాగేందర్ స్వీయ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్ రాజకందుకూరి గారి చేతుల మీదుగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మేకర్స్ విడుదల చేశారు.
రాజ్ కందుకూరి గారు మాట్లాడుతూ, సినిమా టైటిల్ సిల్క్ శారీ అద్భుతంగా గ్రాండియర్ ఉందని , డైరెక్టర్ నుండి ఆశించిన అద్భుతమైన పనితనం కనిపించింది . టీజర్ మరియు ఫస్ట్ లుక్ చాల బాగున్నాయి అని .. ప్రొడ్యూసర్ గారికి మరియు డైరెక్టర్ గారికి పేరుతో పాటు మనీ కూడా రావాలి అని ఆశిస్తున్నాను . ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఈ సిల్క్ శారీ పై నమ్మకాన్ని చేశాడు.
హీరోగా నటిస్తున్న వాసుదేవ్ రావు మాట్లాడుతూ మా డైరెక్టర్ నాగేందర్ ఒక మంచి సబ్జెక్టు తో ఈ సినిమా ని తెరకెక్కించారు. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా మంచి చిత్రాన్ని నిర్మించారు . టైటిల్ రిలీజ్ చేసినందుకు రాజుకందుకూరి గారికి థాంక్స్ చెప్పుకుంటున్నాను .
బలమైన కథ, దానికి తగ్గట్టుగానే డ్రామా సన్నివేశాలను అద్భుతంగా రాసుకొని ఓ ఆసక్తికరమైన సంఘటన చుట్టూ “సిల్క్ శారీ ” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కచ్చితంగ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
నటీనటులు: వాసుదేవ్ రావు , రీవా చౌదరి , ప్రీతీ గోస్వామి , ఓంకార్ నాథ్ శ్రీశైలం , కోటేష్ మానవ తదితరులు.
డైరెక్టర్ :టి . నాగేందర్
నిర్మాతలు : కమలేష్ కుమార్ , రాహుల్ అగర్వాల్ హరీష్ చండక్
బ్యానర్: చాహత్ ప్రొడక్షన్స్
సంగీత దర్శకుడు: వరికుప్పల యాదగిరి
కెమెరా : సనక రాజశేఖర్
పీఆర్ఓ: శ్రీపాల్ చొల్లేటి
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…