తమిళ దర్శకుడు ఒబెలి ఎన్.కృష్ణ.. సూర్య, జ్యోతిక, భూమికతో సిల్లుఇండ్రు ఒరు కాదల్ సినిమాతో డైరెక్టర్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మంచి విజయం సాధించారు. ఈ సినిమా తెలుగులో ‘నువ్వు నేను ప్రేమ’గా రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఒబెలి కృష్ణ ఇటీవల తమిళ్ స్టార్ హీరో శింబుతో ‘పాతు తల’ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు.
‘పాతు తల’ సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ఆ సమయంలో డైరెక్టర్ కృష్ణ ట్యాలెంట్‌ని చూసి అభినందించారు. కృష్ణ ట్యాలెంట్‌ని అభినందిస్తూ ఎ.ఆర్.రెహమాన్ ఒక Apple MacBook Proని కృష్ణకు బహుమతిగా ఇచ్చారు. ఆస్కార్ అవార్డు అందుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ని కృష్ణ తన సినిమా ట్యాలెంట్‌తో మెప్పించారు.
కృష్ణ మాస్ సినిమాతో పాటు లవ్ సినిమాలు స్టార్ హీరోలతో తీసి హిట్స్ కొట్టారు. ఇప్పుడు మరో కొత్త జోనర్‌లో భారీ ప్రాజెక్ట్ ని తెరకెక్కించబోతున్నారు డైరెక్టర్ కృష్ణ. ఈసారి పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నారు. ప్రముఖ తమిళ నిర్మాత, గ్లోబల్ వన్ స్టూడియోస్ అధినేత రమేష్ కృష్ణమూర్తి నిర్మాణంలో డైరెక్టర్ కృష్ణ ఓ స్టార్ హీరోతో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ని తెరకెక్కిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఈ విషయంలో ఎ.ఆర్.రెహమాన్ డైరెక్టర్ కృష్ణను అభినందించారు.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్‌ని డైరెక్టర్ కృష్ణ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో డైరెక్టర్‌గా కృష్ణ స్థాయి మరింత పెరగనుంది. ఒకపక్క డైరెక్టర్ గానే కాక నటుడిగా కూడా అప్పుడప్పుడు పలు సినిమాల్లో కనిపిస్తున్నారు. ఇటీవల తాను తెరకెక్కించిన పాతు తల సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్ర చేశారు కృష్ణ. ప్రేక్షకులని మెప్పించడానికి త్వరలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో రానున్నారు డైరెక్టర్ కృష్ణ.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…