“దయా” వెబ్ సిరీస్ లో ప్రతి క్యారెక్టర్ యూనిక్ గా ఉంటుంది – హీరో జేడీ చక్రవర్తి

జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన ‘దయా’ వెబ్ సిరీస్ ఈ నెల 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ లో నటించిన ఎక్సీపిరియన్స్ షేర్ చేసుకున్నారు జేడీ చక్రవర్తి.

  • కంటెంట్ ఈజ్ ది ప్రిన్స్, డైరెక్టర్ ఈజ్ కింగ్ అని నమ్మే నటుడిని నేను. దయా అనే కథను దర్శకుడు పవన్ సాధినేని చెప్పిన విధానం ఆకట్టుకుంది. అందుకే ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు అంగీకరించాను. కథ మనకున్న స్థలం లాంటిదైతే..అందులో అందమైన ఇళ్లు కట్టడం డైరెక్షన్ లాంటిది. సినిమా అనే సౌధాన్ని అందంగా నిర్మించడం దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది.
  • హాట్ స్టార్ నుంచి దయా వెబ్ సిరీస్ కోసం నన్ను తరుచూ సంప్రదించారు. నేను సిరీస్ చేసే మూడ్ లో లేననుకుంటా…డెసిషన్ చెప్పడం పోస్ట్ పోన్ చేస్తూ వచ్చా. వాళ్లు మాత్రం వదలలేదు. సినాప్సిస్ వినండి అని స్క్రిప్ట్ పంపారు. ఆ తర్వాత డైరెక్టర్ పవన్ సాధినేని ఫోన్ లో పది నిమిషాలు కథ వినిపించాడు. పర్సనల్ గా వచ్చి ఫుల్ స్క్రిప్ట్ చెప్తా అని వచ్చాడు. నేను స్టోరీ వినకుండానే దయా వెబ్ సిరీస్ చేస్తున్నా అని చెప్పా. ఎందుకంటే నాకు గతంలో ఆర్జీవీ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. ఏ దర్శకుడైనా పది నిమిషాల్లో కథ చెప్పగలిగితే అతనికి ఆ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్నట్లు అని ఆర్జీవీ అనేవారు. పవన్ ఫోన్ లో 10 మినిట్స్ స్టోరీ చెప్పినప్పుడే అతనికి కథ మీద ఉన్న పట్టు తెలిసింది. దాంతో ఫుల్ నెరేషన్ వినకుండానే ఓకే చెప్పాను.
  • దయా వెబ్ సిరీస్ కు దర్శకుడు పవన్ పెద్ద బలం. ఇందులో క్యారెక్టర్స్ ఒక స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. ప్రతి క్యారెక్టర్ యూనిక్ గా ఉంటుంది. నటీనటులకు గుర్తింపు తెచ్చే పాత్రలు ఇందులో ఉంటాయి. నా మొదటి సినిమా శివతోనే నేను జేడీ అయిపోయా. అలాగే బాహుబలిలో సత్యరాజ్ ను కట్టప్పగానే గుర్తుంచుకుంటాం. ఇలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్న వెబ్ సిరీస్ దయా. లొకేషన్స్, క్యారెక్టర్స్, స్క్రిప్ట్ అన్నీ బాగా కుదిరిన సిరీస్ ఇది.
  • దయాలో నేను ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ ను. చేపలను ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లడం నా పని. దయా వరల్డ్ ను ప్రారంభం నుంచీ 10, 12 నిమిషాల పాటు ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాడు. ఆ ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ కు ఒకరోజు అమ్మాయి శవం కనిపిస్తుంది. పోలీసులకు చెప్పేంత ధైర్యం అతనిలో ఉండదు. ఈ భయంలో ఉండగానే ఇంకో శవం దొరుకుతుంది. సాదాసీదా జీవితం గడిపే ఆ డ్రైవర్ జీవితాన్ని ఈ ఘటనలు మలుపుతిప్పుతాయి. ఆ ఎమోషన్స్ అన్నీ దయాలో చూస్తారు.
  • బాలీవుడ్ నాకు పొరుగు ఇల్లు లాంటిది. అందుకే కొంతకాలం అటువైపు వెళ్లి వచ్చా. అయితే నా బలం తెలుగు చిత్ర పరిశ్రమ. అందుకే మళ్లీ ఇక్కడ ప్రాజెక్ట్స్ చేస్తున్నా. ఇండస్ట్రీలో డిమాండ్ అండ్ సప్లై గురించి మీకు తెలుసు. నా కోసం విపరీతంగా ఆఫర్స్ వస్తున్నాయి నేను చేయడం లేదని చెప్పడం అబద్ధమే అవుతుంది. కానీ కొన్ని క్యారెక్టర్స్ నాకు నచ్చక వదిలేస్తున్నవీ ఉన్నాయి.
  • ఓటీటీలో స్టార్ డమ్ ను కౌంట్ చేయలేము అనడం సరికాదు. సినిమా ఎంత సక్సెస్ అయ్యింది అనేందుకు థియేటర్ లో మనకు కలెక్షన్స్ లెక్కిస్తాం. కానీ ఓటీటీలో ఎంతమంది చూశారు అనేది కొలమానం. కథను సినిమాలో కంటే విస్తృతంగా చెప్పేందుకు వెబ్ సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. వెబ్ సిరీస్ లో కొత్త వాళ్లకూ ఆదరణ దక్కుతుంది. వాళ్లనూ రిసీవ్ చేసుకుంటారు. కానీ థియేటర్ లో స్టార్స్ సినిమాలకు మాత్రమే బయ్యర్స్ ఉంటారు. ఇది ఓటీటీకున్న అడ్వాంటేజ్. నేను జేడీ చక్రవర్తి కాకుండా కొత్త నటుడైనా దయాలో చూస్తారు.
Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago