ప్రియదర్శి హీరోగా నవనీత్ శ్రీరామ్‌ డైరెక్టర్ గా మూవీ అనౌన్స్ మెంట్

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP) ప్రొడక్షన్ నెం. 9ని అనౌన్స్ చేశారు. తన కెరీర్‌లో వరుసవిజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి హీరోగా రూపొందనున్న ఈ చిత్రాన్ని  SVACLLP & రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సగర్వంగా ప్రెజెంట్ చేస్తోంది. ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డును అందుకున్న జాన్వీ నారంగ్‌నిర్మాతగా మేడిన్ ప్రొడక్షన్ గా రూపొందనున్న ఈ చిత్రంతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

బలగంతో పెద్ద విజయాన్ని అందుకున్న ప్రియదర్శి ఈ ఏడాది ఓం భీమ్ బుష్‌తో బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నాడు. సేవ్ ది టైగర్స్ ఫ్రాంచైజీ తెలుగు ఒరిజినల్ ఆల్ టైమ్‌లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ప్రియదర్శికి వండర్ ఫుల్ ఫిల్మ్స్ లైనప్ లో వున్నాయి.  

ఈ కొత్త చిత్రం సరికొత్త కాన్సెప్ట్‌తో కూడిన రొమాంటిక్  స్టొరీ, ఇందులో ప్రియదర్శి డిఫరెంట్ హిలేరియస్ పాత్రలో కనిపించనున్నారు. “థ్రిల్-యు ప్రాప్తిరస్తు” అనే క్యాచీది ట్యాగ్‌లైన్. ఈ ట్యాగ్ లైన్ సినిమా ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతోందో తెలియజేస్తుంది.

జాన్వీ నారంగ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ మార్గదర్శకత్వంలో కొన్ని కంటెంట్-రిచ్ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తొలి ప్రయత్నంలో వస్తున్న ఈ  చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకునే అవుట్-అండ్-అవుట్-ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. నిర్మాణంలో అపార అనుభవం, స్క్రిప్ట్‌లను ఎంచుకోవడంలో సిద్ధహస్తుడు రానా దగ్గుబాటి లాంటి స్టార్‌ సపోర్ట్ చేయడం జాన్వీ గుడ్ లక్.

ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. ఈ చిత్రం జనవరి, 2025లో సెట్స్‌పైకి వెళ్లనుంది. తారాగణం, టెక్నికల్ టీం వివరాలతో పాటు చిత్రం టైటిల్ త్వరలో రివిల్ చేయనున్నారు మేకర్స్.

తారాగణం: ప్రియదర్శి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్
నిర్మాత: జాన్వీ నారంగ్
ప్రెజెంటర్స్: శ్రీ వెంకటేశ్వర ఏషియన్ సినిమాస్ LLP, రానా దగ్గుబాటి
బ్యానర్లు: SVCLLP,  స్పిరిట్ మీడియా
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago