ఈసారైనా’ టీమ్. దక్షిణాది భాషల్లో నవంబర్ 8 న ఘనంగా విడుదల

విప్లవ్ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ సినిమా ‘ఈసారైనా’. ఈ సినిమా కథ అందమైన గ్రామీణ నేపధ్యంలో సాగుతుంది. ఒక నిరుద్యోగ యువకుడు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతూ అతని ప్రేమను వెతుక్కునే దిశగా ఎలా సాగుతాడు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాకి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. చిత్రం లో పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

హీరో విప్లవ్ మాట్లాడుతూ, “ఈ సినిమా మీ అందరి ముందుకు రానున్నందుకు కారణం సంకీర్త్ అన్న. ఆయన ముందు నుంచి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసారు. ఈ సినిమా కి నేనే ప్రొడ్యూసర్ ని. అన్నిటినీ కష్టమైనా మేనేజ్ చేశాను. టీజర్, సాంగ్స్ అన్నీ చూడండి. నచ్చితే, సినిమా చూడండి” అన్నారు.

హీరోయిన్ అశ్విని మాట్లాడుతూ, “శిరీష క్యారెక్టర్ నాతో చేయించిన విప్లవ్ కి తాంక్స్. ఈ సినిమా కి షూటింగ్ చేస్తున్న రోజులు సమ్మర్ హాలిడేస్ లాగ అనిపించింది. నా ఫస్ట్ సినిమా కి ఇలాంటి క్యారెక్టర్ రావడం సంతోషంగా ఉంది. ఇది సినిమా మాత్రం కాదు, ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు.” అన్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ మాట్లాడుతూ, “విప్లవ్ అన్న నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థాంక్స్. సలార్ తర్వాత నాకు క్యారెక్టర్ చెప్పగానే, నాకు నచ్చేసింది. ఈ రోజు ప్రివ్యూ లో చూసాక అనిపించినా విషయం ఏంటి అంటే, అన్ని సీన్స్ చాలా ప్లెజంట్ గా అనిపించాయి.” అన్నారు.

కో ప్రొడ్యూసర్ సంకీర్త్ మాట్లాడుతూ, “ఇక్కడకు వచ్చినందుకు అందరికీ చాలా థాంక్స్. నా దృష్టి లో చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమి ఉండదు. నా దృష్టి లో ఒక సినిమా మనతో పాటు ఇంటికి వచ్చిందంటే, అది అందరికీ నచుతుంది. ఈ సినిమా లో కూడా అందరూ ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. నవంబర్ 8 న థియేటర్స్ లో ఈ సినిమా చూడొచ్చు.” అన్నారు.

నటుడు మెహబూబ్ బాషా మాట్లాడుతూ, “ఈ సినిమా ని నేను లాస్ట్ ఇయర్ చేశాను. ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఈ సినిమా లో పెద్ద సెటప్ ఏమి ఉండదు కానీ విప్లవ్, సంకీర్త్ అందరూ బాగా కష్టపడ్డారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అనిపిస్తుంది. నవంబర్ 8 న ఈ సినిమా ని థియేటర్స్ లో చూడొచ్చు.” అన్నారు.

నటుడు ప్రదీప్ రాపర్తి మాట్లాడుతూ, “ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు విప్లవ్ గారికి, నిర్మాత గారికి, మెయిన్ లీడ్ కి తాంక్స్. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అని నమ్మకం ఉంది” అన్నారు.

సంకీర్త్ కొండ సహ-నిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ సినిమా లో అశ్విని అయలూరు ప్రధాన నటిగా నటించారు. ఈ సినిమా నవంబర్ 8 న విడుదల కానుంది.

నటీనటులు : విప్లవ్, అశ్విని, ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా, కార్తికేయ దేవ్, నీతు క్వీన్, సత్తన్న, అశోక్ మూలవిరాట్

టెక్నీషియన్స్:
నిర్మాత: విప్లవ్
సహ నిర్మాత: సంకీర్త్ కొండా
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: విప్లవ్
సంగీతం: తేజ్
డి ఓ పి: గిరి
ఎడిటింగ్: విప్లవ్
కళ: దండు సందీప్ కుమార్
డి ఐ: మేయిన్ స్టూడియోస్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అభినయ్ కొండ
లైన్ ప్రొడ్యూసర్: పూర్ణిమ రెడ్డి
సాహిత్యం: గోరేటి వెంకన్న, రాకేందు మౌళి, శరత్ చేపూరి
గాయకులు: గోరేటి వెంకన్న, ఎల్ వి రేవంత్, పి వి ఎన్ ఎస్ రోహిత్, యశ్వంత్ నాగ్
పబ్లిసిటీ మరియు లిరికల్: బాబీ
పి ఆర్ ఓ : మధు VR

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago