టాలీవుడ్

దుల్కర్ ‘కురుప్’ సెప్టెంబర్ 30న జీ సినిమాలు లో

సెప్టెంబర్ 30న దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో అలరించనున్న ‘జీ సినిమాలు’ ఛానల్ హైదరాబాద్, 27th సెప్టెంబర్, 2022: ప్రేక్షకులకు 24 గంటల పాటు సినిమాలతో నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్న ‘జీ సినిమాలు’ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలతో తెలుగు ప్రజలకు మరింత చేరువైతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా, ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమా యొక్క వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన థ్రిల్లర్ మూవీ ‘కురుప్’ సెప్టెంబర్ 30న సాయంత్రం 6 గంటలకు ‘జీ సినిమాలు’ ఛానల్లో తెలుగులో ప్రసారం కానుంది.

దుల్కర్ సల్మాన్ తో పాటూ శోభిత, షైన్ టామ్, అనుపమ పరమేశ్వరన్, ఇంద్రజిత్ మరియు తదితరులు కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి రివ్యూస్ అందుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, కథ సుకుమారన్ కురుప్ అనే విదేశాలకి పారిపోయిన ఒక వాంటెడ్ క్రిమినల్ చుట్టూ తిరుగుతుంది. డబ్బుపై దురాశతో తాను చేసే నేరాలు మరియు తప్పించుకోవడానికి అల్లే కథలు సినిమాని రక్తి కట్టిస్తాయి. సినిమాలో మనోజ్ బాజ్‌పాయ్, టోవినో థామస్ వంటి నటులు చేసిన పాత్రలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, అద్భుతమైన బాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు కట్టిపడేసే స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ అనుభూతిని అందచేయడం ఖాయం.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

9 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago