డైరెక్టర్ రాధాకృష్ణ సినిమా టైటిల్ ‘జూనియర్’

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ప్రస్తుతం కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తోంది. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ సౌత్‌లో తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషలలో విడుదల కానుంది.చిత్ర నిర్మాతలు ఇదివరకే కిరీటి రెడ్డిని పరిచయం చేస్తూ  ఒక గ్లింప్స్ ని విడుదల చేసారు. ఈ వీడియోలో కిరిటీ తన నైపుణ్యం అందరినీ ఆకట్టుకున్నారు. ఇందులో ఎక్స్ ట్రార్డినరీ గా కనిపించారు కిరిటీ. స్టైలిష్‌గా కనిపించి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ మెప్పించారు.

ఈ రోజు కిరిటీ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటిస్తూ మరో గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘జూనియర్’  అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ వీడియోలో ఈ తరం యువత గురించి,  భవిష్యత్తు లక్ష్యాల గురించి ప్రతి జూనియర్‌కు ఉండే విశ్వాసం గురించి కిరిటీ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.కిరిటీ రెడ్డి డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్‌తో తనదైన ముద్ర వేశారు. కాలేజీలో గోడకు ఆనుకుని ఫిడ్జెట్ స్పిన్నర్‌ను తిప్పుతూ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ గ్లింప్స్ కోసం ప్లజంట్ బీజీఎం స్కోర్‌ చేశారు.

టైటిల్ గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విడుదల చేసిన కొద్దిసేపటికే 5 మిలియన్ వ్యూస్ ని క్రాస్ అందరినీ ఆకర్శిస్తోంది.లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వారాహి చలనచిత్రం ప్రొడక్షన్ నంబర్ 15 గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు ఉన్నారు. టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్స్ లో ఒకరైన శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, జెనీలియా ఒక ముఖ్యమైన పాత్రతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ లెజెండ్ క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్ర  కీలక పాత్రలో కనిపించనున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాహుబలి లెన్స్‌మెన్ కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ గా,  భారతదేశపు అగ్రశ్రేణి స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

తారాగణం: కిరిటీ, శ్రీలీల, జెనీలియా, డాక్టర్ రవిచంద్ర వి తదితరులు

సాంకేతిక విభాగం

రచన, దర్శకత్వం: రాధా కృష్ణ

నిర్మాత: సాయి కొర్రపాటి

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

డీవోపీ: కెకె సెంథిల్ కుమార్

ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్

స్టంట్ డైరెక్టర్: పీటర్ హెయిన్

పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago