రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” సినిమా షూటింగ్ అప్డేట్ చెప్పిన స్టార్ డైరెక్టర్ మారుతి

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ “రాజా సాబ్”. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో “రాజా సాబ్” సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. ప్రస్తుతం తిరుపతి, శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్లారు దర్శకుడు మారుతి. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా రెబెల్ ఫ్యాన్స్ “రాజా సాబ్” సినిమా అప్డేట్ కోసం రిక్వెస్ట్ చేయగా.. సమాధానం ఇస్తూ షూటింగ్ అప్డేట్ చెప్పారు డైరెక్టర్ మారుతి.

డైరెక్టర్ మారుతి స్పందిస్తూ – “రాజా సాబ్” సినిమా షూటింగ్ చాలా పాజిటివ్ వైబ్స్ తో చేస్తున్నాం. కొంత టాకీ పార్ట్, సాంగ్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. వివిధ కంపెనీలు సీజీ వర్క్స్ చేస్తున్నాయి. వాటి నుంచి వచ్చే ఔట్ పుట్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ అయితే లిరికల్ సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తాం. సినిమా అంటే సమిష్టి కృషి. ఏ ఒక్కరి క్రాఫ్ట్ కాదు. ఎంతోమంది శ్రమ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అందుకే అనుకున్న టైమ్ కు కొంత ఆలస్యమవుతోంది. సీజీ వర్క్స్ కంప్లీట్ అయితే నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ “రాజా సాబ్” సినిమా విడుదల తేదీని ప్రకటిస్తుంది. ఈ సినిమా కోసం మేము పడిన కష్టాన్ని, మా ప్యాషన్ ను వీలైనంత త్వరగా మీకు చూపించాలని కోరుకుంటున్నాం. అని అన్నారు.

ప్రెస్టీజియస్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ “రాజా సాబ్” సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తోంది. “రాజా సాబ్” సినిమాతో ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నారు డైరెక్టర్ మారుతి. ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Tfja Team

Recent Posts

శ్రీరామ్‌ ‘ది మేజ్‌’ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌ విడుదల

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్‌. ఈయన…

1 hour ago

సబ్ స్క్రైబర్స్ కు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కంటెంట్ అందిస్తూ ఎంటర్ టైన్ చేస్తున్న ఆహా ఓటీటీ

తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…

1 hour ago

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా పయనం నుంచి ‘పయనమే’ అంటూ సాగే మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…

2 hours ago

ఎన్‌టీఆర్ వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు

ప్రముఖ‌ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్‌.టి.ఆర్‌) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ క‌ల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు…

5 hours ago

‘శబార’ మూవీకి ఖచ్చితంగా సక్సెస్ మీట్ జరుగుతుంది.. ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ ఈవెంట్‌లో హీరో దీక్షిత్ శెట్టి

దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…

8 hours ago

‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్…

9 hours ago