ధూం ధాం ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ హీరోయిన్ హెబ్బా పటేల్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో “ధూం ధాం” సినిమా హైలైట్స్ ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపింది హీరోయిన్ హెబ్బా పటేల్.

  • డైరెక్టర్ సాయి రాజేశ్ గారు ఒకరోజు ఫోన్ చేసి “ధూం ధాం” ప్రాజెక్ట్ గురించి చెప్పారు. రైటర్ గోపీ మోహన్ దగ్గర కథ ఉంది. మీకు నచ్చితే చేయండి అన్నారు. నేను కథ విన్నాను. స్క్రిప్ట్ బాగా నచ్చింది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ఇది. ఈ మధ్య కాలంలో నేను అన్నీ సీరియస్ రోల్స్ చేస్తూ వస్తున్నాను. ఇలాంటి సినిమా నేను చేసి చాలా కాలమవుతోంది. నాకు రిఫ్రెషింగ్ గా ఉంటుందని అనిపించింది. అందుకే వెంటనే ఓకే చెప్పాను.
  • “ధూం ధాం” సినిమాలో నా క్యారెక్టర్ పేరు సుహానా. తనొక బబ్లీ గర్ల్. బాగా డబ్బున్న అమ్మాయి. ఇంట్లో ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల తను కోరుకున్న వెకేషన్ కు వెళ్తుంటుంది. అలా ఒక వెకేషన్ లో హీరోను కలుస్తుంది. అక్కడి నుంచి వారి స్నేహం, ప్రేమ మొదలవుతాయి. ఈ చిత్రంలో నటించడం నాకు కష్టంగా అనిపించలేదు. కేక్ వాక్ లాంటి ఫీలింగ్ కలిగింది.
  • చేతన్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. తను మంచి కోస్టార్. మా ఇద్దరిలో ఎవరు జూనియర్ , ఎవరు సీనియర్ అనేది చూసుకోలేదు. కెమెరా ముందు ఎవరు ఎంత యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా పర్ ఫార్మ్ చేస్తాం అనేది ఆలోచించాం. పోలెండ్ లో లాంగ్ షెడ్యూల్ చేశాం. అక్కడ వింటర్ ఇంకా స్టార్ట్ కాకముందే వెళ్లాం. సాంగ్ షూట్స్ లో సారీస్ లో కనిపిస్తాను. చలి పెద్దగా లేకపోవడం వల్ల ఇబ్బందిగా అనిపించలేదు.
  • మా ప్రొడ్యూసర్ రామ్ కుమార్ గారు టీమ్ మొత్తం ఎంతో కంఫర్ట్ గా ఉండేలా చూసుకున్నారు. పోలెండ్ లో కూడా ఏ రోజూ మాకు ఇబ్బంది కలిగించలేదు. ప్రొడ్యూసర్ గా మూవీ పర్పెక్ట్ గా వచ్చేందుకు తాను చేయాల్సిన సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు. మంచి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ గా ఆయనకు పేరు వస్తుంది.
  • డైరెక్టర్ సాయి కిషోర్ గారు చాలా జోవియల్ గా ఉంటారు. నాకు సరదాగా మాట్లాడుతూ ఉండే వ్యక్తులంటే ఇష్టం. సాయి కిషోర్ గారు అలాంటి పర్సన్. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీగా అనిపించింది. “ధూం ధాం” టీమ్ లో నేను గతంలో పనిచేసిన కొందరు టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్లంతా ఉండటం వల్ల మూవీ షూటింగ్ సంతోషంగా జరిగింది.
  • గోపీ సుందర్ గారు కంపోజ్ చేసిన సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. నాకు టమాటో బుగ్గల పిల్ల ఫేవరేట్ సాంగ్. అలాగే సాంగ్స్ మ్యూజికల్ గా ఎంత బాగుంటాయో విజువల్ గా కూడా అంతే బాగుంటాయి.
  • “ధూం ధాం” సినిమాలో చాలా మంది పేరున్న ఆర్టిస్టులు ఉన్నారు. నాకు వారితో పెద్దగా కాంబినేషన్ సీన్స్ లేవు. హీరోకు ఉన్నాయి. మల్లెపూల టాక్సీ పాటలో మాత్రం నేను వారందరితో కలిసి కనిపిస్తాను. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, ఎంటర్ టైన్ మెంట్ తో “ధూం ధాం” సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మంచి ఫీల్ గుడ్ చిత్రమిది. తప్పకుండా ఈ నెల 8న థియేటర్స్ కు వెళ్లి చూడండి.
  • నా లైఫ్ లో “ధూం ధాం” చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. నా బర్త్ డే, కొత్త సినిమా సైన్ చేసిన రోజు, నా సినిమా హిట్ టాక్ వచ్చిన రోజున ధూం ధాం గా సెలబ్రేట్ చేసుకుంటా. నటిగా నాకు కెమెరా ముందు నిల్చున్న ప్రతి సందర్భం ఇష్టమే. సినిమా, వెబ్ సిరీస్, ఫొటో షూట్ ఏదయినా సరే ఎంజాయ్ చేస్తా.
Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

2 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

2 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

2 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

2 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

2 days ago