పా పాండి, రాయన్ వంటి బ్లాక్ బస్టర్‌ల తరువాత ధనుష్ ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’ అంటూ దర్శకుడిగా మరోసారి అందరినీ మెప్పించేందుకు రెడీ అయ్యారు. ధనుష్ హోమ్ బ్యానర్ అయిన వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌కె ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ మూవీని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి విడుదల చేస్తోంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను పెంచేశారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ప్రారంభంలో.. ధనుష్ కనిపించి ఇదొక సాధారణ ప్రేమ కథ అని అసలు కథలోకి తీసుకెళ్తాడు. ఓ ప్రేమ, బ్రేకప్ నేపథ్యంలో ఈ సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉండబోతోందని అర్థం అవుతోంది. మాజీ ప్రేయసి పెళ్లి వెళ్లాల్సిన పరిస్థితి రావడం, అక్కడ ఎదురయ్యే సంఘటనలు, ఇలా అన్నీ కూడా యూత్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.
ప్రజెంట్ ట్రెండ్‌కు తగ్గ స్టోరీతో ధనుష్ రాబోతోన్నాడని ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. జివి ప్రకాష్ కుమార్ అద్భుతమైన పాటలు, ఆర్ఆర్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్ ఇలా అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉందని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. ప్రియాంక అరుల్ మోహన్ స్పెషల్ అప్పియరెన్స్, ఆ పాటకు సంబంధించిన బిట్ కూడా ట్రైలర్‌లో పొందు పర్చారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా లియోన్ బ్రిట్టో, ఎడిటర్‌గా జి.కె. ప్రసన్న పని చేశారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…