బియాండ్ ఫెస్ట్‌లో ‘దేవర’ రెడ్ కార్పెట్ ప్రీమియ‌ర్‌.. ఈజిప్షియ‌న్ థియేట‌ర్‌

మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచ‌ల‌నాల‌ను క్రియేట్ చేస్తోంది. అభిమానులు స‌హా అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై  మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆర్‌.ర‌త్న‌వేలు, ఎడిట‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు శిరిల్ వంటి స్టార్ టెక్నీషియ‌న్స్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్నారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు.

దేవ‌ర రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో ‘దేవర పార్ట్ 1’లోని సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. రీసెంట్‌గా ముంబైలో గ్రాండ్ లెవ‌ల్లో ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ ట్రైల‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. అన్నీ భాష‌ల్లో క‌లిపి మిలియ‌న్స్ వ్యూస్‌తో ట్రైల‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. దీంతో ఇప్ప‌టికే సినిమాపై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ లెవ‌ల్‌కు చేరుకున్నాయి. డిఫ‌రెంట్ ప్లానింగ్‌తో సాగుతోన్న ఈ మూవీ ఎక్స్‌పెక్టేష‌న్స్ రోజు రోజుకీ పెరుగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో దేవ‌ర ప్రీమియ‌ర్ షోను సెప్టెంబ‌ర్ 26 సాయంత్రం ఆరున్న‌ర గంట‌ల‌కు బియాండ్ ఫెస్ట్‌లో హాలీవుడ్, లాస్ ఏంజిల్స్‌లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్‌లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. బియాండ్ ఫెస్ట్ ఘనమైన సినిమా చరిత్రను కలిగిన ప్రతిష్టాత్మకమైన సినిమా వేదిక.ఇలాంటి వేదిక‌లో రెడ్ కార్పెట్ ఈవెంట్ జ‌ర‌గ‌టం గొప్ప విష‌యం. అలాగే ఇక్క‌డ ప్రీమియ‌ర్ కాబోతున్న తొలి ఇండియన్ సినిమాగా దేవ‌ర అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది.

ఈ రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు హాలీవుడ్‌కు చెందిన‌ ప్ర‌ముఖ సినీ ప్ర‌ముఖులు హాజ‌రు కాబోతున్నారు. దేవ‌ర టీమ్‌తో పాటు హై ఫై ప్రొఫైల్ ఉన్న వ్య‌క్తులు పాల్గొంటుండ‌టం అనేది ప్ర‌పంచ వేదిక‌పై దేవ‌ర ఖ్యాతిని మ‌రింత ఇనుమ‌డింప చేయ‌నుంది.

ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న జాన్వీ క‌పూర్ హీరోయిన్‌. సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఇంకా ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, అజ‌య్, గెట‌ప్ శీను త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ర‌త్న‌వేలు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, సాబు శిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27న  దేవ‌ర చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

3 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago