టాలీవుడ్

జీ5లో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో డీమాంటే కాలనీ 2

స్ట్రీమింగ్ వరల్డ్ ని దున్నేస్తోంది డీమాంటే కాలనీ2. 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్‌ మినిట్స్ తో జీ 5లో హిస్టరీ క్రియేట్‌ చేస్తోంది డీమాంటే కాలనీ 2. దాదాపు దశాబ్దం క్రితం విడుదలైన డీమాంటే కాలనీ అద్భుతమైన విజయం సాధించింది. హారర్‌ కామెడీ విభాగంలో సరికొత్త ఒరవడికి తెరదీసింది. ఓ వైపు భయపెడుతూనే, నవ్వులు కురిపించి, ఈ జోనర్‌కి ప్రత్యేకమైన ప్రేక్షకులను క్రియేట్‌ చేసింది. అజయ్‌ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ సినిమాలో అరుళ్‌నిధి, ప్రియా భవానీ శంకర్‌ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. మొదటి భాగం ఎక్కడ ఆగిందో, సరిగ్గా అక్కడి నుంచే రెండో భాగాన్ని స్టార్ట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం జీ5లో ప్రదర్శితమవుతోంది డీమాంటే కాలనీ2.

సాహసాలను ఇష్టపడే నలుగురు స్నేహితులు – శ్రీనివాసన్‌, విమల్‌, రాఘవన్‌, సాజిత్‌.. థ్రిల్‌ని ఇష్టపడే ఈ నలుగురూ డీమాంటే కాలనీలోని ఓ మేన్షన్‌కి వెళ్తారు. 19వ శతాబ్దంలో ధనికుడైన పోర్చుగీస్‌ బిజినెస్‌మేన్‌ జాన్‌ డీమాంటేకి చెందిన మేన్షన్‌ అది. అయితే అక్కడ పారానార్మల్‌ యాక్టివిటీస్‌ ఉంటాయి. ఎందరి శాపాలకో గురయి ఉంటుంది.  దాని వల్ల పలు రకాల ఇబ్బందులకు గురయి ఉంటాడు అతను. అలాంటి వ్యక్తికి చెందిన మేన్షన్‌కి వెళ్లిన నలుగురికి ఏమయింది? అక్కడ ఇరుక్కున్న ఆ నలుగురికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? వాటి నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? అనే కథాంశంతో తెరకెక్కింది.

డీమాంటే కాలనీ2కి వస్తున్న అద్భుతమైన స్పందనకు ఆనందం వ్యక్తం చేశారు డైరక్టర్‌ అజయ్‌ జ్ఞానముత్తు. ఆయన మాట్లాడుతూ ” జీ5లో డీమాంటే కాలనీ2 వరల్డ్ డిజిటల్‌ ప్రీమియర్‌కి వచ్చిన స్పందన చూసి నేను ఆశ్చర్యపోయాను. 100 మిలియన్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్ గురించి వినగానే చాలా ఆనందంగా అనిపించింది. ఈ హారర్‌ కామెడీ జీ 5లో అద్భుతంగా మెప్పిస్తోంది. అరుళ్‌నిధి, ప్రియా భవానీ శంకర్‌ నటన గురించి తప్పక ప్రస్తావించాలి. ఇలాంటి జానర్‌కి ఇంత మంది అభిమానులుండటం చాలా గొప్ప విషయం. ఇది జస్ట్ బిగినింగ్‌ మాత్రమే. ఇక్కడి నుంచి ఎంతెంత దూరం ప్రయాణిస్తామో మాటల్లో చెప్పలేం” అని అన్నారు.

అరుళ్‌నిధి మాట్లాడుతూ ”అమేజింగ్‌ థియేట్రికల్‌ రన్‌ చూసిన సినిమా డీమాంటే కాలనీ2. ఇప్పుడు వరల్డ్ డిజిటల్‌ ప్రీమియర్‌లో జీ5లో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ దాటడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో మాతో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మా ప్రాజెక్ట్ మెప్పిస్తోంది. ప్రేమతో, అభిమానంతో ఫ్యాన్స్ పంపిస్తున్న సందేశాలు చూస్తుంటే సంబరంగా ఉంది. ఇలాంటి గొప్ప ఆదరణ చూస్తుంటే నమ్మలేని నిజంలాగా ఉంది” అని అన్నారు.

జీ5లో స్ట్రీమింగ్‌ అవుతున్న డీమాంటే కాలనీ2ని మీరు మిస్‌ కాకండి… 

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

11 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago