‘దక్కన్ సర్కార్’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్

హైద‌రాబాద్:
కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ దక్కన్ సర్కార్. తాజాగా ఈ సినిమా పోస్టర్, టీజర్ లాంచ్ కార్య‌క్ర‌మం తెలుగు ఫిలిం ఛాంబ‌ర్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ పాల్గొని చిత్ర‌యూనిట్‌ను అభినందించారు.

తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి మాట్లాడుతూ.. ”తెలంగాణ ఉద్యమంలోని కష్టాలను ఈ సినిమాలో చూపించారు. ఉద్యమంలో పని చేసిన కళా శ్రీనివాస్ ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి ఈ సినిమా తీశాడు. ఉద్య‌మాన్ని చూపిస్తున్న ఇలాంటి సినిమాను ప్ర‌తి ఒక్క‌రు ఆద‌రించాలి. చిత్ర‌యూనిట్‌ను అభినందిస్తున్నాను.” అని అన్నారు.

తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ”ఇలాంటి సినిమాలను మ‌న‌మంతా ఆహ్వానించాలి. ఈ సినిమాలో నటీనటులు బాగా చేశారు. ఒక సినిమాతో ఎన్నో కుటుంబాల‌కు ఉపాధి దొరుకుతుంది. అందుకే ఈ సినిమాను హిట్ చేయాల‌ని కోరుతున్నాను. ఈ సినిమా విడుద‌ల విష‌యంలో నా మ‌ద్ద‌తు ఉంటుంది.” అని అన్నారు.

డైరెక్ట‌ర్ కళా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి ఎంతో గొప్ప‌ది, ఇక్క‌డి ప్రకృతి ఎంతో బాగుంటుంది. తెలంగాణలో ప్రతి అంశంపై సినిమా తీయొచ్చు. తెలంగాణ సినిమాలు ఇంకా ఎన్నో రావాల్సి ఉంది. ఈ క్ర‌మంలో తెలంగాణ ఉద్య‌మాన్ని తెరపై ఆవిష్క‌రించాము. నిజ జీవితంలో మంచి క్యారెక్టర్ ఉన్న వారినే సినిమాలో క్యారెక్ట‌ర్లుగా తీసుకున్నాను. పోరాటాలకు విరామం ఉండ‌ద‌నే కాన్సెఫ్టుతో ఈ సినిమా చేశాను. సాయి చంద్ , జై శ్రీను వంటి తెలంగాణ ఆణిముత్యాలను కోల్పోయాం. ఉద్య‌మ క‌ళాకారుల‌ను, నా ఆత్మీయుల‌ను ఈ సంద‌ర్భంగా త‌లుచుకోవ‌డం భావోద్వేగంగా ఉంది. ‘దక్కన్ సర్కార్’ ఆడియో లాంచ్ త్వరలో నిజామాబాద్‌లో భారీగా నిర్వహించబోతున్నాము. ఈ సినిమాను ఆద‌రించాల‌ని ప్ర‌తి ఒక్క‌రిని కోరుకుంటున్నాను. మా సినిమా పోస్టర్, టీజర్ లాంచ్ కార్య‌క్ర‌మంకు వ‌చ్చిన అతిథుల‌కు, తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు, మీడియా మిత్రుల‌కు పేరుపేరున కృత‌జ్ఞ‌త‌లు.” అని అన్నారు.

ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం కళా శ్రీనివాస్ ఎంతో శ్రమించారు. సినిమాను తెర‌కెక్కించిన తీరు బాగుంది. సినిమాకు మన అందరి సహకారం అవసరం. చిన్న సినిమాను పెద్ద హిట్ చేయాలి.” అని అన్నారు.

నటి హేమ మాట్లాడుతూ.. డైరెక్ట‌ర్ కళా శ్రీనివాస్ ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొని ఒక మంచి సినిమాను మ‌న ముందు ఉంచారు. ఈ సినిమాను మ‌న‌మంతా ఆద‌రించాలి.
హీరో చాణక్య మాట్లాడుతూ.. డైరెక్ట‌ర్ కళా శ్రీనివాస్ త‌న ప్ర‌తిభ‌తో 12 సంవత్సరాల ఉద్యమాన్ని 2 గంటల్లో చూపించారని, తెలంగాణలో ఉన్న ప్రతీ ఒక్కరి జీవితాన్ని ప్రతిబింభించేలా చిత్రంలోని సన్నివేశాలు ఉంటాయని.. ప్రస్తుత తెలంగాణా స్థితి గతులను ఆధారంగా చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రతీ ఒక్కరు బాధ్యతగా భావించి ఈ చిత్రాన్ని ప్రమోట్వా చేయాలని చెప్పారు.
ఒక గొప్ప ప్రయత్నంగా ఈ సినిమాను చేశారని ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారు కొనియ‌డారు. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించబోతున్న సినిమా అంటూ కీర్తించారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు ముఖ్య‌పాత్ర‌లోనూ డైరెక్టర్ కళ శ్రీనివాస్ పాత్ర ప్ర‌శంసించ‌ద‌గిన‌ద‌ని అన్నారు.

నటి నటులు : చాణక్య, కళా శ్రీనివాస్, కియా రెడ్డి, మౌనిక, ఘర్షణ శ్రీనివాస్, బుగత సత్యనారాయణ, జబర్దస్త్ రాజమౌళి తదితరులు..
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:
క‌ళా శ్రీనివాస్.

బ్యానర్: కళా ఆర్ట్స్
నిర్మాత‌: క‌ళా శ్రీనివాస్
డీవోపీ: భ‌ర‌త్, న‌ర‌హ‌రి
మ్యూజిక్: మ‌ల్లిక్ ఎంవీకే
ఎడిటింగ్: అలోషియ‌స్ సేవియర్ , చాణక్య
డ‌బ్బింగ్: అమూల్య స్టూడియోస్,
డీఏ: తిరు
పీఆర్ఓ: కడలి రాంబాబు, దయ్యాల అశోక్.

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

8 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago