జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘డియర్’. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నట్‌మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర పై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు.తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలకు ఒక్కరోజు గ్యాప్ ఉంటుంది. తమిళ వెర్షన్ ఏప్రిల్ 11న విడుదల కానుండగా, తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది.
తాజాగా డియర్ నుంచి భలే వెడ్డింగ్ పాటని విడుదల చేశారు. ఈ చిత్రానికి మ్యూజిక్ కూడా అందిస్తున్న జివి ప్రకాష్ కుమార్ ఈ పాట ని పుట్ ట్యాపింగ్ వెడ్డింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు.రాకేందు మౌళి లిరిక్స్ అందించిన ఈ పాటని నారాయణన్ రవిశంకర్, సిందూరి విశాల్ గ్రేస్ ఫుల్ గా ఆలపించారు. ఈ పాటలో జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది. ఈ వెడ్డింగ్ నెంబర్ లో వారి డ్యాన్స్ మూమెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సినిమా ఆంధ్రా థియేట్రికల్ హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్ కొనుగోలు చేయగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. హ్యూజ్ థియేట్రికల్ చైన్ బిజినెస్లు ఉన్న ప్రొడక్షన్ , డిస్ట్రిబ్యూషన్ సంస్థల బ్యాకింగ్ తో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్రాండ్ గా విడుదల కానుంది.డియర్‌లో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు
జగదీష్ సుందరమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటుడిగా, వ్యక్తిగా నటభూషణ శోభన్ బాబుకు ఓ ప్రత్యేకస్థానం ఉందని సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు. శోభన్ బాబు కథానాయకుడిగా…
కొత్త టెక్నిషియన్స్‌ను అనౌన్స్ చేసిన టీమ్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ రిలీజ్‌కు కౌంట్ డౌన్…
నిజాయితీతో, భావోద్వేగపూరిత కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వేగంగా ఎదుగుతోన్న నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. డా.…
ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను మెపిస్తూ వారి హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్…
యష్ రాజ్ ఫిల్మ్స్ హిస్టారికల్ బ్లాక్ బస్టర్ దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే (DDLJ) 30 వసంతాల సందర్బంగా…
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…