విజువల్ ట్రీట్‌గా విజయ్ దేవరకొండ, సమంత ‘ఖుషి’ టైటిల్ సాంగ్

డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ మధ్యే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించింది చిత్రయూనిట్. ఇప్పుడు మేకర్లు మ్యూజికల్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో చేపడుతున్నారు.

తాజాగా ఖుషి థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఖుషి అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ ఇప్పుడు శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు శివ నిర్వాణ సాహిత్యం అందించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వయంగా ఆలపించారు. ఇక హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఇక ఇందులో విజువల్స్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి. ఈ మెలోడీ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారనుంది.

ఇప్పటికే ఖుషి ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే వంద మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది. ఇన్ స్టాగ్రాం రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఇలా ఎక్కడపడితే అక్కడ ట్రెండ్ అవుతూనే ఉంది. రెండో పాట ఆరాధ్య సైతం శ్రోతలను కట్టి పడేసింది. ఇప్పుడు ఈ మూడో పాట ఖుషి సైతం చార్ట్ బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు.

నటీనటులు:
విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.

టెక్నికల్ టీమ్:

మేకప్ : బాషా
కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్
ఆర్ట్ : ఉత్తర కుమార్, చంద్రిక
ఫైట్స్ : పీటర్ హెయిన్
రచనా సహకారం : నరేష్ బాబు.పి
పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
పబ్లిసిటీ : బాబ సాయి
మార్కెటింగ్ : ఫస్ట్ షో
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్
మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్
డి.ఐ, సౌండ్ మిక్స్ ః అన్నపూర్ణ స్టూడియోస్, విఎఫ్ఎక్స్ మాట్రిక్స్
సి.ఇ.ఓ : చెర్రీ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జి.మురళి
నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి
సాహిత్యం : శివ నిర్వాణ
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ నిర్వాణ.

Tfja Team

Recent Posts

గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతున్న హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…

2 minutes ago

బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ – ఈటీవీ విన్ నుంచి “ఇంకా ఎం అనుకోలేదు” క్రేజీ టైటిల్ అనౌన్స్‌మెంట్ సెప్టెంబర్ 4న సినిమా విడుదల

ఈటీవీ విన్‌తో కలిసి గతంలో పలు విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన నిర్మాత వంశీ నందిపాటి, మరోసారి ఈటీవీ విన్‌తో కలిసి…

19 minutes ago

ఇంటర్నేషనల్ వుమెన్స్ డే సందర్భంగా స్టార్ హీరోయిన్ నభా నటేష్ కవర్ పేజీ పబ్లిష్ చేసిన ప్రముఖ మేగజైన్ షీ ఇండియా

ఈరోజు ఇంటర్నేషనల్ వుమెన్స్ డే సందర్భంగా ప్రముఖ మేగజైన్ షీ ఇండియా స్టార్ హీరోయిన్ నభా నటేష్ ను తన…

2 hours ago

ఘనంగా నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ కు ‘కత్తి’ కాంతరావు స్మారక జాతీయ పురస్కారం ప్రధానోత్సవ కార్యక్రమం

భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో నటప్రపూర్ణ…

2 hours ago

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” టైటిల్ గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

19 hours ago

ఘనంగా జరిగిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కావ్య రెడ్డి రోకా వేడుక

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో కావ్య రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి రోకా వేడుక ఇరు…

19 hours ago