దళపతి విజయ్ వారిసు ఫస్ట్ సింగిల్ విడుదల

దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్,  పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారసుడు’/ వారిసు సంక్రాంతి బిగ్గెస్ట్ ఎట్రాక్షన్స్ లో ఒకటి. ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌ టైనర్‌లో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక.ప్రముఖ నటీనటులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ సినిమాపై భారీ బజ్ వుంది. సినిమా పోస్టర్‌ లు కూల్‌ గా, కలర్‌ఫుల్‌ గా కనిపించాయి. ఇందులో విజయ్,  రష్మికల జోడి లవ్లీగా కనిపించింది.ఫస్ట్ సింగిల్ ప్రోమోతో ఆసక్తిని పెంచిన మేకర్స్ ఈ రోజు ఎంతగానో ఎదురుచూస్తున్న రంజితమే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. సూపర్ ఫామ్‌ లో ఉన్న ఎస్ థమన్ ఈ పాట కోసం ఫుట్‌ట్యాపింగ్ నంబర్‌ ను స్కోర్ చేశారు. ఎమ్ఎమ్ మానసితో కలిసి విజయ్ స్వయంగా హై బీట్‌, ఎనర్జిటిక్ గా పాడటం అద్భుతంగా వుంది. విన్న వెంటనే ఉత్సాహాన్ని పెంచుతోంది. విజయ్ వాయిస్ ఈ పాటకు మరింత ఆకర్షణగా నిలిచింది. వివేక్ సాహిత్యం అందించారు.

విజయ్‌, జానీ మాస్టర్‌ల కాంబినేషన్‌ సూపర్‌ హిట్‌. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన స్టెప్పులకు విజయ్ డ్యాన్స్ చేయడం చూడటం ఎప్పుడూ ట్రీట్‌ గా ఉంటుంది. డ్యాన్స్‌లు ట్రెండీగా, గ్రేస్ ఫుల్ గా  ఉన్నాయి. ఈ పాటలో రష్మిక మందన్న స్టన్నింగ్ గా కనిపించింది. సెట్టింగ్,  బ్యాక్‌డ్రాప్‌లు వైబ్రెటింగా వున్నాయి. మొత్తంమీద ఇది మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే డ్యాన్స్ ట్రాక్. వైరల్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ పాటలో వున్నాయి. తెలుగు వెర్షన్ పాటను త్వరలో విడుదల చేయనున్నారు.ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం.ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు.

తారాగణం: విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: వంశీ పైడిపల్లి

కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌ 

నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా

సహ నిర్మాతలు: శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత

సంగీతం: ఎస్ థమన్

డీవోపీ: కార్తీక్ పళని

ఎడిటింగ్:  కెఎల్ ప్రవీణ్

డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే: వివేక్

ప్రొడక్షన్ డిజైనర్లు: సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి

ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బి శ్రీధర్ రావు, ఆర్ ఉదయ్ కుమార్

మేకప్: నాగరాజు

కాస్ట్యూమ్స్: దీపాలి నూర్

పబ్లిసిటీ డిజైన్స్: గోపి ప్రసన్న

వీఎఫ్ఎక్స్: యుగంధర్

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago