క్రేజీ రాంబో పెద్ద హిట్ కావాలి: టైటిల్ లాంచ్ ఈవెంట్ లో హీరో అశ్విన్ బాబు

-షమ్ము హీరోగా హరీష్ మధురెడ్డి దర్శకత్వంలో, ర్యాప్ రాక్ షకీల్ సప్తాశ్వ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ది అల్టిమేట్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్ “క్రేజీ రాంబో” గ్రాండ్ గా ప్రారంభం- టైటిల్ లాంచ్

షమ్ము హీరోగా హరీష్ మధురెడ్డి దర్శకత్వంలో, సప్తాశ్వ ప్రొడక్షన్స్ బ్యానర్ రూపొందనున్న ది అల్టిమేట్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్ “క్రేజీ రాంబో” పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ వేడుకలో హీరో అశ్విన్ బాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

కామెడీ, యాక్షన్, డ్రామా, రొమాన్స్‌తో కూడిన రోలర్-కోస్టర్ రైడ్‌గా ఈ సినిమా వుండబోతోంది. రాంబో టైటిల్ రోల్ లో హీరో షమ్ము చాలా ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. సినిమా స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు, సంగీతం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనున్నాయి.

టైటిల్ లాంచ్ ఈవెంట్ లో హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. క్రేజీ రాంబో టైటిల్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. సినిమా తప్పకుండా క్రేజీ గా ఉంటుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్, సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలి’ అని కోరారు.

హీరో షమ్ము మాట్లాడుతూ,.. ఇది నా మూడో సినిమా. మా అన్నయ్య ప్రొడక్షన్ లో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. క్రేజీ రాంబో కథ చాలా బావుటుంది. అందరినీ అలరిస్తుంది’ అన్నారు.

నిర్మాత, సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ.. డైరెక్టర్ మధు గారు కథ చెప్పినపుడు నాకు చాలా నచ్చింది. మా తమ్ముడు హీరోగా నేనే నిర్మించాలని అనుకున్నాను. చాలా మంచి కంటెంట్. అందరినీ ఎంటర్ టైన్ చేసేలా సినిమా వుంటుంది’ అన్నారు.

ఈ చిత్రానికి ర్యాప్ రాక్ షకీల్ మ్యూజిక్ అందిస్తున్నారు, సినిమాటోగ్రఫీ జైపాల్ రెడ్డి.

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.

తారాగణం: షమ్ము
బ్యానర్ : సప్తాశ్వ ప్రొడక్షన్స్,
రచన, దర్శకత్వం: హరీష్ మధురెడ్డి
నిర్మాత, సంగీతం: ర్యాప్ రాక్ షకీల్ ,
సినిమాటోగ్రఫీ: జైపాల్ రెడ్డి,
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ, బాష్య శ్రీ,
స్టైలింగ్ : భవ్య నీలిమ
వీఎఫ్ఎక్స్ : వర్క్‌ఫ్లో
పీఆర్వో: తేజస్వి సజ్జా

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago