కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ  

Must Read

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా,  వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. ఈ సిరీస్ కి కొనసాగింపుగా ‘కానిస్టేబుల్‌ కనకం 2’ ఈ నెల 8న ఈటీవీ విన్‌లో రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కానిస్టేబుల్‌ కనకం నాకు చాలా ప్రత్యేకం. ఇంత అద్భుతమైన ఎమోషన్ ఉన్న స్టోరీకి నన్ను ఎంపిక చేసినందుకు డైరెక్టర్ ప్రశాంత్ కి థాంక్యూ. సీజన్ 3 కూడా చేయాలని కోరుకుంటున్నాను.  సాయిబాబా గారు, హేమంత్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్లు మరింత అద్భుతమైన కంటెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈటీవీలో భాగం కావడం చాలా గర్వంగా ఉంది. ఒకప్పుడు ఈటీవీ విన్ సబ్స్క్రైబ్ చేయమని అడిగే వాళ్ళం. కానీ ఈరోజు అందరి ఇంట్లో ఈటీవీ విన్ ఉంది. అది ఇది గొప్ప సక్సెస్ గా భావిస్తున్నాను. మేఘలేఖ పర్ఫామెన్స్ ఈ సీజన్లో అదిరిపోతుంది. సురేష్ గారి మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. సీజన్ 2 అద్భుతంగా ఉంటుంది. జనవరి8 నుంచి స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్ గా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చంద్రిక ఎక్కడ అని అందరూ అడుగుతున్నారు. నేను సహస్ర ఎవరు అని అడుగుతున్నాను. జనవరి 8న ఈటీవీ విన్ లో కానిస్టేబుల్ కనకం 2 రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ చూడాలని కోరుతున్నాను.  

ఈటీవీ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ.. చిరంజీవి గారు ట్రైలర్ లాంచ్ చేయడంతో కనకం ప్రయాణం మొద లైంది. సీజన్ 2 ఆయన సినిమా థియేటర్ కి రావడంతో పాటు ముగుస్తుంది. మెగాస్టార్ గారికి థాంక్ యు. క్రికెట్ లో ఒక ఓవర్ లో ఆరు బంతులు ఉంటాయి. అనగనగా, ఎయిర్ కానిస్టేబుల్ కనకం, లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్.. ఇలా ఐదు బౌండరీలు అయ్యాయి. ఇప్పుడు సీజన్ 2 కానిస్టేబుల్ కనకం సీజన్ 2 కూడా బౌండరీ కాబోతోంది. నిర్మాత సాయిబాబా గారు చాలా పాషన్  తో పని చేశారు. ఆయన లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. సురేష్ బొబ్బిలి గారు చాలా వైవిధ్యమైన మ్యూజిక్ అందిస్తున్నారు.  ఈ సిరిస్ కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. మేఘ గారికి ఇది మైల్ స్టోన్ కాబోతుం. వర్ష గారు చాలా పాజిటివ్ పర్సన్. సంక్రాంతి సినిమాలన్నీ హిట్ కావాలని కోరుకుంటున్నాను థియేటర్స్ లో సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి మా కంటెంట్ ని చూడాలని ఆశిస్తున్నాం. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

బిజినెస్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కనకం సీజన్ వన్ బిగ్గెస్ట్ సక్సెస్ అయింది. సీజన్ వన్ ఇప్పుడు ఫ్రీగా చూడుచ్చు. సీజన్ 2 subscribe చేసుకోవాలి. ఆర్టిస్టులకి టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ. తెలుగులో గుర్తుపెట్టుకునే వెబ్ సిరీస్ ఇచ్చినందుకు డైరెక్టర్ ప్రశాంత్ కి థాంక్యూ. నిర్మాతలు సాయిబాబా హేమంత్ గారికి థాంక్యూ. జనవరి 8న కానిస్టేబుల్ కనకం సీజన్ 2 ని ఈటీవీలో చూడాలని కోరుతున్నాను.

డైరెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ.. సీజన్ 2 అదిరిపోయింది. చంద్రిక ఎక్కడ అనే సస్పెన్స్ అందరిలో ఉంది. ఇంత ఎక్సైటింగ్ జర్నీలో నాతో పాటు ప్రయాణించిన నటీనటులకు టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. చంద్రిక ఎక్కడ అనే క్వశ్చన్ మార్క్ కి ఆన్సర్ సీజన్ 2 లో మీకు తెలుస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన  నిర్మాతలకు ధన్యవాదాలు. సాయి గారు నితిన్ గారికి థాంక్యూ.సీజన్ 2 ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఈ సంక్రాంతికి అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తున్నాం. అందరూ థియేటర్స్ లో సినిమాలు చూడండి. ఇంటికి వచ్చి చక్కగా ఈటీవీ విన్ లో ఈ సిరిస్ ని ఎంజాయ్ చేయండి.  

మేఘలేఖ మాట్లాడుతూ…  నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.  నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థాంక్యూ. సురేష్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. వర్ష తో కలిసి పని చేయడం ఆనందంగా వుంది. జనవరి 8న కానిస్టేబుల్ కనకం సీజన్ 2 తో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను

ప్రొడ్యూసర్ సాయిబాబా మాట్లాడుతూ.. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఆర్టిస్టులు, టెక్నికల్ టీం అందరూ వోన్ చేసుకొని పని చేశారు. సీజన్ 1 కంటే ఇది అద్భుతంగా వుంటుంది. జనవరి 8న ఈటీవీ విన్ లో కనకం సీజన్2  ని చూడాలని కోరుకుంటున్నాను

నిర్మాత హేమంత్ మాట్లాడుతూ..  మీడియా మిత్రులు అందరికీ థాంక్స్. టీమ్ అందరికి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థాంక్స్. సీజన్ 2 కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. థాంక్యూ

మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. మ్యూజిక్ డైరెక్టర్ అనే టైటిల్ చూసుకోవడం నా కల. ఆ కలని ఈటీవీ నిజం చేసింది. వాళ్ళ పనిచేయడం ఒక గొప్ప అనుభూతి. కానిస్టేబుల్ కనకం సీజన్ వన్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సీజన్ 2 కూడా అంతే అద్భుతమైన ఆదరణ అందుకుంటుందని నమ్మకం ఉంది. సీజన్ 2 చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఈ సీజన్ మిమ్మల్ని అందరిని అలరిస్తుంది. ఈ ఈవెంట్ లో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News