చియాన్ విక్రమ్ “తంగలాన్” సినిమా ట్రైలర్ రిలీజ్

చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” సినిమా త్వరలోనే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “తంగలాన్” ట్రైలర్ రిలీజ్ చేశారు.

“తంగలాన్” సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – బ్రిటీష్ పాలనా కాలంలో కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో బంగారం కోసం వేట మొదలుపెడతారు బ్రిటీష్ అధికారులు. స్థానిక తెగల వారిని బంగారం వెలికి తీసేందుకు పనిలో పెట్టుకుంటారు. ఒక తెగ నాయకుడిగా విక్రమ్ ను చూపించారు. ఈ బంగారం వేటలో రెండు తెగల మధ్య పోరు మొదలవుతుంది. తన వారిని కాపాడుకునేందుకు ఎంతటి సాహసానికైనా వెనకడుగు వేయని నాయకుడిగా విక్రమ్ చూపించిన భావోద్వేగాలు ఆకట్టుకుంటున్నాయి. విక్రమ్ ఈ పాత్ర కోసం మారిపోయిన తీరు కూడా ఆశ్చర్యపరుస్తోంది. ట్రైలర్ లో విల్లు, బరిసెలు, ఈటెలతో చేసిన యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ గా నిలుస్తున్నాయి. విక్రమ్ బ్లాక్ పాంథర్ తో చేసిన ఫైట్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చరిత్రలోని వాస్తవ ఘట్టాలను దర్శకుడు పా రంజిత్ తన సినిమాటిక్ యూనివర్స్ లో ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు “తంగలాన్” ట్రైలర్ తో తెలుస్తోంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు త్వరలోనే “తంగలాన్” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

నటీనటులు – చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు

టెక్నికల్ టీమ్

సంగీతం – జీవీ ప్రకాష్ కుమార్
ఆర్ట్ – ఎస్ ఎస్ మూర్తి
ఎడిటింగ్ – ఆర్కే సెల్వ
స్టంట్స్ – స్టన్నర్ సామ్
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్స్ – స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్
నిర్మాత – కేఈ జ్ఞానవేల్ రాజా
దర్శకత్వం – పా రంజిత్

Tfja Team

Recent Posts

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ భేటీ: ‘పద్మశ్రీ’ వచ్చినందుకు ఘన సత్కారం

ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…

20 hours ago

‘ఎర్రచీర’ ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. ఫిబ్రవరి 6న నేను టికెట్ కొనుక్కుని సినిమా చూస్తా: మాజీ ఎంపీ మధు యాష్కి

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఎన్ వీ వీ…

21 hours ago

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్అమరావతి

ప్రముఖ సినీ నటులు, ‘నటకిరీటి’ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మంగళవారం సాయంత్రం (03/02/2026) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ…

21 hours ago

బరాబర్ బాధపడుతున్నాను!!

ఇటీవల తాను అతిధిగా పాల్గొన్న సినిమా ఫంక్షన్ లో జరిగిన దానికి బాధపడుతున్నానని తెలిపారు ప్రముఖ నటులు జె.డి.చక్రవర్తి. ఆయన…

21 hours ago

3 వేల ఎంట్రీలు, 100 మంది ఫైనలిస్టులు.. AVAA జర్నీకి శ్రీకారం చుట్టిన విష్ణు మంచు,హోస్ట్‌గా శివ బాలాజీ

సినిమా రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో AVAA ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో AVAA ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అధికారికంగా…

21 hours ago

టాలెంటెడ్ హీరో లెజెండ్ శరవణన్ “లీడర్” సినిమా గ్లింప్స్ రిలీజ్, ఏప్రిల్ లో గ్రాండ్ రిలీజ్ కు రాబోతున్న మూవీ

లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "లీడర్". ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్…

21 hours ago