ప్రముఖ సినీ నటులు, ‘నటకిరీటి’ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మంగళవారం సాయంత్రం (03/02/2026) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ గారికి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ అవార్డును ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజేంద్ర ప్రసాద్ గారిని సాదరంగా ఆహ్వానించి, ఆయనను ఘనంగా సత్కరించారు. నాలుగు దశాబ్దాలుగా వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించడమే కాకుండా, తెలుగు సినిమా ఖ్యాతిని పెంచినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం లభించడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు

