చార్మింగ్ స్టార్ శర్వా, మాళవిక నాయర్, అభిలాష్ రెడ్డి కంకర, యువి క్రియేషన్స్ ‘బైకర్’ నుంచి ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా తన అప్ కమింగ్ మూవీ ‘బైకర్‌’ లో మోటార్‌సైకిల్ రేసర్‌గా ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది. ఫస్ట్ లుక్, ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ తో ఇప్పటికే మంచి బజ్‌ క్రియేట్ చేసింది.

‘ప్రెట్టీ బేబీ’ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసిన మేకర్స్ బైకర్ మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేశారు. జిబ్రాన్ ఈ పాటని అదిరిపోయే బీట్స్ తో డ్యాన్సింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. జిబ్రాన్, యాజిన్ నిజార్, సుబ్లాషిని ఎనర్జిటిక్ వోకల్స్ తో ఆకట్టుకున్నారు. కృష్ణకాంత్ లిరిక్స్ చాలా క్యాచిగా వున్నాయి.

ఈ సాంగ్ లో శర్వా, మాళవిక నాయర్ కెమిస్ట్రీ అదిరిపోయింది. శర్వా డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజింగ్ గా వున్నాయి. ఈ సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.    

1990, 2000 బ్యాక్ డ్రాప్ లో సాగే “బైకర్” రేసింగ్ యాక్షన్ తో పాటు  ఎమోషనల్, మల్టీ జనరేషనల్ ఫ్యామిలీ డ్రామా. స్పీడ్, అంబిషన్, హార్ట్‌ఫెల్ట్ రిలేషన్‌షిప్స్ తో  మూడు జనరేషన్స్ ఒకే రేసింగ్ కలతో, కుటుంబ బంధాలతో సాగే అద్భుతమైన కథ.

ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ జె. యువరాజ్, , అనిల్ కుమార్ పి ఎడిటర్. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్. ఎ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు, ఎన్ సందీప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

బైకర్ డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ కానుంది.  

నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర
నిర్మాతలు: వంశీ-ప్రమోద్
సమర్పణ: విక్రమ్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: జిబ్రాన్
DOP: J యువరాజ్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఎడిటర్: అనిల్ కుమార్ పి
ఆర్ట్ డైరెక్టర్: ఎ పనీర్ సెల్వం
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Tfja Team

Recent Posts

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

1 day ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

2 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

2 days ago

బుక్ మై షోలో 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…

2 days ago

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…

2 days ago

“అరుణాచల గిరి ప్రదక్షిణ”ఫస్ట్ గ్లిమ్ప్స్ ఆవిష్కరించినప్రఖ్యాత నటులు తనికెళ్ళ!!

"ఆటగదరా శివా" అంటూ శివతత్వాన్ని ఆవిష్కరించిన ప్రముఖ నటుడు - రచయిత- దర్శకుడు తనికెళ్ళ భరణి… సుప్రసిద్ధ మహిమాన్విత పుణ్యక్షేత్రం…

2 days ago