“సంతాన ప్రాప్తిరస్తు” నుంచి చాందినీ చౌదరి బర్త్ డే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

విక్రాంత్, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ చిత్రాన్ని మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “ఏబీసీడీ మూవీ, ” అహ నా పెళ్లంట” వెబ్ సిరీస్ లను తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గారితో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన యాంటీ డ్రగ్స్ యాడ్ ను రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఏక్ మినీ కథ, ఎక్స్ ప్రెస్ రాజా వంటి సూపర్ హిట్ సినిమాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది.

ఈ రోజు హీరోయిన్ చాందిని చౌదరి పుట్టిన రోజు సందర్భంగా ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాలో చాందినీ చౌదరి కల్యాణి ఓరుగంటి అనే పాత్రలో నటిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగి తన జీవిత భాగస్వామిగా కావాలని, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌ వద్దని ఆమె కోరుకుంటున్నట్లు పోస్టర్ ద్వారా రివీల్ చేశారు.

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్య సంతానలేమి. ఆ సమస్యను “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాలో వినోదాత్మకంగా చూపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

నటీనటులు – విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, శ్రీలక్ష్మి, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, అనిల్ గిలా, కిరీటి, సద్దాం, తదితరులు

సాంకేతిక బృందం:

మ్యూజిక్ డైరెక్టర్: సునీల్ కశ్యప్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ. మధుసూదన్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: మాహి రెడ్డి పండుగుల
డైలాగ్స్: కళ్యాణ్ రాఘవ్
ఎడిటర్: సాయికృష్ణ గనాల
ప్రొడక్షన్ డిజైనర్: శివకుమార్ మచ్చ
కాస్ట్యూమ్స్ : అస్వత్ భైరి, కే. ప్రతిభా రెడ్డి
పులిచెర్ల పూర్ణ
డిజిటల్ మీడియా: మాయాబజార్
పీఆర్ ఓ – జీఎస్కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
కథ, స్క్రీన్‌ప్లే: సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్ జి
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ట్రైలర్.. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’,…

9 hours ago

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన హీరో సత్యదేవ్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నూతన చిత్రం

హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ…

13 hours ago

మే 1న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నెక్ట్స్ మూవీ “సమ్మర్ హాలిడేస్”

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని.…

13 hours ago

పాన్‌ సౌత్ స్టార్‌తో సైకాలజికల్ థ్రిల్లర్.. అనుపమ పరమేశ్వరన్ కొత్త మూవీ అనౌన్స్!

పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో కొత్త ఫీచర్ ఫిల్మ్‌ను ఎస్ కే…

13 hours ago

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ ఫిబ్రవరి 27న థియేటర్స్ లో విడుదల !!!

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

15 hours ago

కంప్లీట్ ఎంటర్ టైనర్ “క్రేజీ కల్యాణం” మూవీ నుంచి బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న…

17 hours ago