పవన్ బాబు కి “బ్రో”, సంపూర్ణేష్ బాబు కి “సోదర”

సంపూర్ణేష్‌బాబును చూస్తుంటే గర్వంగా ఉంది. సంపూ నా దృష్టిలో ఎప్పూడూ స్టార్‌: ‘సోదరా’ ట్రైలర్‌ వేడుకలో సంచలన దర్శకుడు సాయి రాజేష్‌
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ‘బ్రో’ చిత్రంలా, సోదరా కూడా ఘనవిజయం సాధించాలి: సోదరా ట్రైలర్‌ వేడుకలో కల్ట్‌ నిర్మాత ఎస్‌కేఎన్‌

వైవిధ్యమైన సినిమాలు, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే సినిమాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న కథానాయకుడు సంపూర్ణేష్‌ బాబు.. ఈ సారి అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్న ‘సోదరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్‌ కూడా ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సోదరా’. మోహన్ మేనంపల్లి దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకుని, నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం ఏప్రిల్‌ 25న ఈ వేసవిలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌చేయడానికి థియేటర్స్‌ల్లో విడుదల కాబోతుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్‌, కల్ట్‌ నిర్మాత ఎస్‌కేఎస్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేసి విడుదల చేశారు.

ఈ సందర్భంగా సాయి రాజేష్‌ మాట్లాడుతూ ” ఎస్‌కేఎన్‌ స్పీచ్‌ విన్న తరువాత ఎమోషన్ అయ్యాను. ఎస్‌కేఎన్‌ మంచి మనసు నాకు తెలుసు. ఈ సినిమాను ఎంకరైజ్‌ చేయడానికి తాను ఓ షోను ఏర్పాటు చేస్తానని చెప్పడం నిజంగా గొప్ప విషయం. ఈ సినిమా అందరికి మంచి విజయం అందించాలి. నాకు సంపూ ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. సంపూతో నేను సినిమా తీసి 13 ఏళ్లు అయ్యింది. హృదయకాలేయం సూపర్‌హిట్‌ తరువాత సంపూ నన్ను ఆర్థికంగా చాలా ఆదుకున్నాడు.నాకు ఓ కారు, ఇల్లును తాను పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌ కట్టి ఇప్పించాడు. నాకు సంపూ ఎప్పుడూ తోడుగా ఉన్నాడు. సినిమా ఎన్నో మ్యాజిక్కులు చేస్తుంది. సంపూను చూస్తే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. తాను సంపాందించుకున్న డబ్బులో అందరికి సహాయం చేస్తుంటాడు. సంపూ నా దృష్టిలో స్టార్‌. ఏ రోజుకైనా మా ఇద్దరం ఒకరికొకరం ఉంటాం. ఈ సినిమా సంపూ కెరీర్‌లో మంచి విజయం సాధించాలి’ అన్నారు.

ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ ” చిన్న సినిమాను ప్రమోషన్‌ చేయడానికి వచ్చిన మీడియాకు థ్యాంక్స్‌. నాకు సంపూ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ ఫంక్షన్‌కు వచ్చాను. సంపూకు సాయిరాజేష్‌ అంటే చాలా ఇష్టం. అందరూ చేస్తున్న ప్రయత్నం విజయంవంతం కావాలి. ఈ సినిమాతో సంజోష్‌కు కూడా బ్రేక్‌ రావాలి. కంటెంట్ నమ్మి తీసిన ఈ సినిమా ఆడితే మంచి కిక్‌ వస్తుంది. చిన్న సినిమాలను బాగుండాలని,ఆడాలని కోరుకునే వ్యక్తిని నేను. ఇలాంటి ఫంక్షన్‌లకు రావడం నేను గౌరవంగా భావిస్తున్నాను. సీనియర్‌ నటుడు బాబుమోహన్‌ ఈ సినిమాలో చేయడం హ్యపీగా ఉంది. ఈ సోదరా సినిమా పవన్‌కల్యాణ్‌ బ్రో సినిమాలా ఘన విజయం సాధించాలని, అందరికి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను నేను థియేటర్‌లో ఒక షో బుక్‌ చేసుకోని మా ఫ్రెండ్స్‌ అందరికి చూపిస్తాను. ఇలాంటి చిన్న సినిమాలను నా వైపు నుంచి ప్రోత్సాహించాలనే బాధ్యత వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నాను’ అన్నారు.

బాబు మోహన్‌ మాట్లాడుతూ ” ఈ సినిమాను ఓ పిక్నిక్‌లా చేశాం. మంచి కుటుంబ అనుబంధాలతో ఈ సినిమా ఉంటుంది. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ ఇది. ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. నేను ఇంతకు ముందు ఎన్ని పాత్రలు చేసినా, అన్ని కామెడీ పాత్రలు ఒకదానికొకటి సంబంధం ఉండదు. సోదరాలో కూడా నా పాత్ర ఏడిపిస్తుంది. అందరి హృదయాలకు హత్తుకుంటుంది. చక్కని, కథ, కథనాలతో, మంచి నటులతో చేసిన సినిమా చూసి అందరూ ఎంజాయ్‌ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

సంపూర్ణేష్‌ బాబు మాట్లాడుతూ ”ఈ వేడుక చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన సాయి రాజేష్ ఈ వేడుకకు రావడం హ్యపీగా ఉంది. అప్‌డేట్‌ అయిన తమ్ముడు, అమాయకుడైన అన్న మధ్య జరిగే స్వఛ్చమైన కథ సోదరా. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. ఇది నేను రియల్‌లైఫ్‌లో ఎలా ఉంటానో అలాంటి పాత్ర ఇది. అందరూ ఈ సినిమాను ఆదరించి మా అందరికి మంచి విజయం అందిస్తారని కోరుకుంటున్నాను అన్నారు

హీరో సంజోష్‌ మాట్లాడుతూ ” ఓ సినిమా కష్టపడి తీసిన సినిమాకు ఎస్‌కేఎన్‌, సాయి రాజేష్‌ సపోర్ట్‌ చేయడం ఎంతో హ్యపీ. పల్లెటూరికి వెళ్లి ఓ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములను కలిసి వచ్చిన ఫీలింగ్‌ కలుగుతుంది. అన్నదమ్ముల బంధం విలువ చెప్పేసినిమా ఇది. తప్పకుండా అందరికి నచ్చుతుంది. బాబు మోహన్‌ లాంటి సీనియర్‌ నటుడుతో పనిచేయడం ఎంతో మంచి ఎక్స్‌పీరియన్స్‌. కథతో స్టార్‌లను క్రియేట్‌ చేస్తుంటాడు సాయిరాజేష్‌. ఆ స్టార్‌ సంపూ. ఆయనతో పనిచేయడం ఎంతో హ్యపీగా ఉంది. భవిష్యత్‌లో కూడా సంపూ అన్నతో పనిచేయాలని వుంది.

ఈ వేడుకలో దర్శకుడు మోహన్‌ మైనంపల్లి, దర్శకుడు కృష్ణ చైతన్య, హీరో చైతన్య, దర్శకుడు నవీన్‌ మేడారం, డిఓపీ జాన్‌, ఎడిటర్‌ శివ,లిరిక్‌ రైటర్‌ పూర్ణాచారి, హీరోయిన్‌ ఆర్తి గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago