రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఫ‌స్ట్ నాన్ ఫిల్మ్ హిందీ ట్రాక్ ‘ఓ పరి’.. సాంగ్ లాంచ్ చేసిన బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌వీర్ సింగ్‌

చిత్ర సీమ‌కి భూష‌ణ్ కుమార్ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. దేశంలోని అపార‌మైన ప్ర‌తిభ‌ను గుర్తించి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వ్య‌క్తి ఆయ‌న‌. నాన్ ఫిల్మ్ హిందీ సాంగ్ ‘ఓ పరి’ ద్వారా ఈసారి అద్భుత‌మైన ప్ర‌తిభావంతుడు సౌత్‌కు చెందిన గొప్ప టెక్నీషియ‌న్ డి.ఎస్‌.పి అలియాస్ దేవిశ్రీ ప్ర‌సాద్‌ను మ‌న ముందుకు స‌రికొత్త‌గా తీసుకొచ్చారు. రీసెంట్‌గా ఆ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

గొప్ప ఆక‌ర్ష‌ణీయ‌మైన వ్య‌క్తిత్వాన్ని క‌లిగిన ఇద్ద‌రు క‌లిసి హిందీ నాన్ ఫిల్మ్ వీడియో సాంగ్ కోసం క‌లిశారు. వారెవ‌రో కాదు.. ఒక‌రేమో బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌వీర్ సింగ్‌, మ‌రొక‌రు రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్‌. ఈ పాట‌ను ప్రీమియ‌ర్ చేయ‌ట‌మే కాకుండా, ఓ ప‌రి సాంగ్‌లో సిగ్నేచ‌ర్ స్టెప్‌తో స్టేజ్‌పై దుమ్మ రేపారు. వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న అద్భుత‌మైన కెమిస్ట్రీ వేదిక‌నే కాదు.. ఆ ప్రాంగ‌ణాన్నే ఊపేసింది. డిఎస్‌పి హుక్ స్టెప్‌తో ఆక‌ట్టుకోగా, ర‌ణ్‌వీర్ సింగ్ పాట‌ను పాడి మెప్పించారు.

‘ఓ పరి’ సాంగ్ ఓ ట్రాక్ మాత్ర‌మే కాదు.. మ్యూజిక్ మ్యాస్ట్రో భూష‌ణ్ కుమార్‌.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ మ‌ధ్య ఇదొక మెగా కొలాబ్రేష‌న్‌. త్వ‌ర‌లోనే ఈ పాట‌ను తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. డిఎస్‌పి చేసిన తొలి నాన్ ఫిల్మ్ హిందీ సాంగ్ ఓప‌రి.. దీంతో ఆయ‌న అభిమానుల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కుల్లోనూ తెలియ‌ని ఆస‌క్తి క్రియేట్ అయ్యింది.

ఈ సంద‌ర్భంగా దేవిశ్రీప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘నాన్ ఫిల్మ్ హిందీ మ్యూజిక్ చేయాల‌ని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అలాంటి నాకు భూష‌ణ్ కుమార్ కంటే గొప్ప కొల‌బ్రేష‌న్ ఎవ‌రుంటారు. చాలా హార్డ్ వ‌ర్క్‌, ప్యాష‌న్‌, ప్రేమ‌తో చేసిన సాంగ్ ‘ఓపరి’. ఈ సాంగ్‌తో ఇది వ‌ర‌కంటే ఎక్కువ ప్రేమ‌ను ఆడియెన్స్ నాపై చూపిస్తార‌ని భావిస్తున్నాను. అలాగే ర‌ణ్‌వీర్ సింగ్ కూడా చాలా గొప్ప వ్య‌క్తిత్వ‌మున్నవాడు. మా మ‌ధ్య ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. త‌ను అందించిన స‌పోర్ట్‌కి నేను త‌న‌కు ప్రత్యేక‌మైన ధ‌న్య‌వాదాలు. దీని కంటే ఎగ్జ‌యింట్ ప్రాజెక్ట్స్‌తో భ‌విష్య‌త్తులో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాన‌ని తెలియ‌జేసుకుంటున్నాను. నా అమ్మ‌గారు తొలిసారి ఈ సాంగ్ రిలీజ్ కోసం ముంబైకి వ‌చ్చారు. నా ఫ‌స్ట్ మ్యూజిక్ వీడియోను మా అమ్మ‌గారి స‌మ‌క్షంలో విడుద‌ల చేయాల‌ని క‌ల‌గ‌న్నాను’’ అన్నారు. స్టేజ్ పైకి డిఎస్‌పి త‌న త‌ల్లిని పిలిచి అంద‌రికీ ప‌రిచ‌యం చేశారు.

ర‌ణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ ‘‘రాక్‌స్టార్ డిఎస్‌పి సాంగ్‌ను విడుద‌ల చేయ‌టాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇదొక గొప్ప అనుభూతి. ఆ అనుభూతి ఈ మ్యూజిక్‌లోనూ క‌నిపిస్తంఓది. ఈ సాంగ్‌లోని హుక్ స్టెప్ నాకు బాగా న‌చ్చింది. బీట్ కూడా చాలా క్యాచీగా, అద్బుతంగా ఉంది’’ అన్నారు.

భూషణ్ కుమార్ మాట్లాడుతూ ‘‘డిఎస్‌పి నిజ‌మైన ప్ర‌తి విష‌యంలోనూ నిజ‌మైన రాక్‌స్టార్‌. ఆయ‌న సంగీతాన్ని ఎన్నో సంవ‌త్స‌రాలుగా ప్రేక్ష‌కులు సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. నాన్ ఫిల్మ్ మ్యూజిక్ ఇండ‌స్ట్రీలోకి అత‌ను ప్ర‌వేశించడానికి ఇదే స‌రైన స‌మ‌యంగా నాకు అనిపిస్తుంది. అత‌నితో క‌లిసి ప‌నిచేయ‌టం మ‌ర‌చిపోలేని అనుభూతి. ఓప‌రి సాంగ్ విన‌గానే ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేస్తుంది. ఇలాంటి సింగిల్ ట్రాక్స్‌ను అద్భుత‌మైన రెస్పాన్స్ రావ‌ట‌మ‌నేది ఇండియన్ మ్యూజిక్ రంగానికి గొప్ప స‌మ‌యంగా చెప్పొచ్చు. అలాంటి థండ‌ర్ రెస్పాన్స్ ఈ పాట‌కు వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం నాకుంది’’ అన్నారు.

ఈ పెప్పీ సింగిల్ విన్న‌ప్పుడు దాన్ని రూపొందించిన ప్ర‌తి ఒక్క‌రినీ మ‌నం గుర్తిస్తాం. ఇప్పుడు విడుదలైన పాటతో, ఈ ట్రాక్ స్మాష్ హిట్ కంటే ఇది తక్కువ కాదని మేం గ‌ట్టిగా చెప్ప‌గ‌లం. మీ ప్లే లిస్టులోని పాట‌ల‌న్నింటిలో మించేలా ఓపరి సాంగ్ ఉంటుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ త‌నే నిర్మిస్తూ డైరెక్ట్ చేసిన తొలి హిందీ పాట ‘ఓపరి’ని టీ సిరీస్ యూ ట్యూబ్ ఛానెల్‌లో గ‌మ‌నించ‌వచ్చు.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago